పాడైపోయిన ఫోటోలను ఎలా పునరుద్ధరించాలి.. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు పీహెచ్ డీ

0
184

పాడైపోయిన ఫొటోలను పునరుద్ధరించడానికి వివిధ రకాల అభ్యాస పద్ధతులు అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.ప్రవీణ్ కుమార్ కు డాక్టరేట్ వరించింది. లార్డ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సి. వెంకట నరసింహులు, జేఎన్ టీయూ కాకినాడ పూర్వ ప్రొఫెసర్ డాక్టర్ కె.శివప్రసాద్ లు ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన వెల్లడించారు.

ఈ పరిశోధనలో, క్షీణించిన చిత్రాలను సమర్థవంతంగా పునరుద్ధరించడానికి వివిధ రకాల వేవ్ లెట్లు, లోతైన అభ్యాస పద్ధతులతో వివిధ అల్గారిథమ్ లు అమలు చేసినట్టు తెలియజేశారు. తద్వారా అనుమానిత వ్యక్తిని కనుగొనడం, రోగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ఉపకరిస్తుందన్నారు. ఈ పరిశోధనలో భాగంగా 14 పరిశోధనా పత్రాలను ప్రచురించినట్టు తెలిపారు. ప్రవీణ్ కుమార్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం కాకినాడలోని ప్రతిష్ఠాత్మక జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, ఈఈ సీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here