గీతమ్ ఈనెల 28న టెడ్ఎక్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గౌతం వాసుదేవ్ మీనన్, శిల్పారెడ్డి, సజ్జాద్ షాహిద్ తదితరులు ఉపన్యసించనున్నారు. ఈ కార్యక్రను నిర్వహణకు గీతం హెదరాబాద్ ప్రాంగణం సిద్ధమవుతోంది. ‘రివెప్టైడ్’ యం’ ఇతివృత్తంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యువతకు స్ఫూర్తినిచ్చే అంతర్ దృష్టి ఆలోచనలను దాని లక్ష్యంగా పెట్టుకున్నట్టు విశ్వవిద్యాలయ వర్గాలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
విఖ్యాత భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు గౌతం వాసుదేవ్ మీనన్, ఫ్యాషన్ డిజెనర్, వ్యవస్థాపకురాలు, ఏకేమ్ లెర్నింగ్ సెంటర్ సహ వ్యవస్థాపకురాలు శిల్పా రెడ్డి; ప్రసిద్ధ చిత్రకారుడు సజ్జాద్ ఎప్పి ఐస్ పాప్స్ వ్యవస్థాపక జంట రవి – అనుజా కబ్రా, తెలుగు-ఆంగ్ల పాటల రచయిత, ఇండీ సంగీత కళాకారుడు నితీష్ కొండపర్తి: ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి సవిత శాస్త్రి తదితరులు టెడ్ ఉపన్యాసాలు న్నారు. ఆలోచనలను ప్రేరేపించే కేంద్రీకృత చర్చలు, విస్తృత శ్రేణి విషయాలపై లోతైన అవగాహన కోసం దీనిని చేస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు తమ పేర్లు నమోదు, – తదితర వివరాల కోసం రిద్దీని 8790408465 నెంబరులో సంప్రదించవచ్చు.