చియోంగ్జు (కొరియా) వర్సిటీతో గీతం అవగాహన హెదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, కొరియాలోని చియోంగ్జు విశ్వవిద్యాలయంతో గురువారం ఐదేళ్ల పాటు అమలులో ఉండే రెండు అనగాహనా ఒప్పందాలను కుదుర్చుకుంది. గీతం హెదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్,రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పీ.శ్రీనివాస్, తియోంగ్జు విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ యోంగ్ జిన్: చుంగ్లు ఈ అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు.
జేఎన్టీయూ హెదరాబాద్ పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ కె.రాజగోపాల్, ఆర్కిమెడిస్ గ్రీన్ ఎనర్జీ సీఈవో సూర్యప్రకాష్ గట్టం, కిమ్ ఇన్ షో, కొరియాలోని ఈఎసీసీవో-ఆర్డిఎస్పి చెందిన యాంగ్, కిమ్, ఇన్వెంటర్ రెన్షస్ మెరిమేట్యూన్, కొరియా పరిశోధనా ప్రాజెక్టు ప్రధాన పరిశోధకుడు బ్రేక్ జూన్ వోలతో పాటు ఇరు వర్సిటీలకు చెందిన పలువురు అధికారుల సమక్షంలో ఈ అవగాహన కుదిరింది. రియోంస్థ, గీతం విద్యా సంస్థల మధ్య సహకార సంబంధాలను ఏర్పరచుకోవాలని, పరస్పర ప్రయోజన కరమైన సహకారం అందజేసుకోవాలని, రెండు సంస్థలు, రెండింటిలో అధ్యయనం చేసిన ఏ విభాగంలో నైనా సహకారాన్ని ప్రోత్సహించాలని అంగీకరించాయి.
పరస్పరం ఆసక్తి ఉన్న సమాచారం-పదార్థాల మార్పిడి, అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, పరిశోధనా సిబ్బందిని పరస్పరం మార్చుకోవాలనే అంగీకారానికి వచ్చాయి. విద్యార్ధుల ఇంటర్స్ తో పాటు విమాన సాంకేతిక సమాచారాన్ని పరస్పరం ప్రోత్సహించుకోవాలని నిర్ణయించాయి. ఆ తరువాత కొరియా బృందం గీతం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు, కొరియా ప్రభుత్వ సహకారంతో గీతమ్లో చేపడుతున్న పరిశోధనా ప్రాజెక్టు పురోగతిని సమీక్షించింది.