రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్ వారు 18 వ గ్రాడ్యుయేషన్ మరియు ప్లేసెమెంట్ డే ఘనంగా నిర్వహించారు. గురు నానక్ ఇనిస్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ (జి.ఎన్.ఐ.టి.సి) మరియు గురు నానక్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (జి.ఎన్.ఐ.టి) నుండి సుమారు 1472 మంది పట్టభద్రులైన విద్యార్థులకు విద్యాసంస్థల వైస్-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు అసోసియేట్ డైరెక్టర్లు మెరిట్ సర్టిఫికెట్స్ ను, డిగ్రీ పట్టాలను బహుకరించారు. బాచిలర్ డిగ్రీ మరియు మాస్టర్స్ డిగ్రీ కోర్స్ లకు గాను ప్రధమ మరియు ద్వితీయ స్థానాలు పొందిన గ్రాడ్యుయేట్లకు 28 గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ ను బహుకరించారు. సుమారు 100 కు పైగా బహుళ జాతి కంపెనీలలో ఆన్ అండ్ ఆఫ్ క్యాంపస్ సెలెక్షన్స్ ద్వారా ఉద్యోగాలు పొందిన జి.ఎన్.ఐ.టి.సి. నుండి 905, జి.ఎన్.ఐ.టి నుండి 370 మరియు జి.ఎన్.ఐ.పి నుండి 340 కలిపి మొత్తం 1315 మంది విద్యార్థులకు గురు నానక్ విద్యాసంస్థల యాజమాన్యం వారు ఉద్యోగ నియామక పత్రాలను, ప్రశంసా పత్రాలను అందచేశారు.
వివిధ సంస్థలలో ఉద్యోగాలు పొందిన విద్యార్థుల జాబితా ఈ విధంగా ఉంది. విప్రో 386, టి సి ఎస్ 152, ఎంఫసిస్ 117, వర్చూసా 124, కాగ్నిజెంట్ 139, మొదలైనవి. ఈ సంవత్సరం అత్యధికంగా 16.5. లక్షల వార్షిక వేతనాన్ని వేల్యూ లాబ్స్ సంస్థ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు పొందారు. ఎంబీఏ విద్యార్థులు అత్యధికంగా 10 లక్షలు మరియు ఫార్మసీ విద్యార్థులు 10 లక్షలు గరిష్ట వార్షిక వేతనంగా బైజూస్ సంస్థ ద్వారా పొందారు. గురు నానక్ విశ్వ విద్యాలయం ఛాన్సలర్ మరియు గురు నానక్ విద్యా సంస్థల వైస్-చైర్మన్ సర్దార్ గగన్ దీప్ సింగ్ కోహ్లీ మాట్లాడుతూ ఈ విద్యా సంస్థలు బలమైన శక్తిగా ఎదగాలని, ఈ సంస్థ నుండి ఉత్తీర్ణులైన విద్యార్థుల నిబద్ధత మరియు నైపుణ్యాల నుండి దేశం ప్రయోజనం పొందాలని ఆయన అన్నారు. విద్యార్థులందరూ భారత జాతి నిర్మాణంలో భాగస్థులు కావాలని ఆకాంక్షించారు. గురు నానక్ విశ్వ విద్యాలయం తెలంగాణ ప్రభుత్వ ప్రైవేట్ విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం ఆమోదించబడి 2022 వ సంవత్సరంలో స్థాపించబడిందని ఆయన తెలియజేశారు.
గురు నానక్ విశ్వ విద్యాలయం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పరిశోధన మరియు అభివృద్ధి ప్రయోగశాలలు అత్యాధునిక లైబ్రరీ కలిగి యుండి ప్రపంచవ్యాప్తంగా స్థాపించబడిన అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో సరితూగగలిగే స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. కంప్యూటర్ సైన్స్ సంబంధిత అధునాతన కోర్సులు మాత్రమే కాక బయోటెక్నాలజీ, జీవ శాస్త్రం, పారామెడికల్, కామర్స్ మరియు మేనేజ్మెంట్, అగ్రికల్చర్ వంటి అనేక కోర్సులను డిగ్రీ, పీ జి, పి హెచ్ డి లలో అందిస్తున్నది అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ అన్ని అధ్యయన విభాగాలలో తదుపరి ప్రాధాన్యత గమ్యస్థానంగా గురు నానక్ విశ్వ విద్యాలయం మారుతుందని తెలియజేసారు. గురు నానక్ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ మరియు విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్.ఎస్. సైనీ మాట్లాడుతూ, అర్హులైన పట్టభద్రులందరూ ప్రతిష్టాత్మకమైన బహుళ జాతి సంస్థలలో ప్లేసెమెంట్స్ పొందినట్లు చెప్పారు.
గ్రాడ్యుయేషన్ డే అనేది ప్రతి విద్యార్థి జీవితంలో మరపురాని సంతోషకరమైన రోజని, గురు నానక్ విద్యా సంస్థలలో నుండి గ్రాడ్యుయేట్ ఐన ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, బాధ్యతాయుతంగా విలువలు కలిగిన గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ మరియు గురు నానక్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ గా సేవలందిస్తూ నేక్ ఏ ప్లస్ గ్రేడ్ మరియు ఎన్.బి.ఏ అక్రెడిటేషన్ పొందినవని అన్నారు జి.ఎన్.ఐ.టి.సి. డైరెక్టర్ డాక్టర్ కే వెంకటరావు, జి.ఎన్.ఐ.టి.సి. జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పి. పార్థసారధీ, జి.ఎన్.ఐ.టి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శ్రీనాధ రెడ్డి, జి.ఎన్.ఐ.టి డీన్ అకడెమిక్స్ డాక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ మరియు ఇతర అసోసియేట్ డైరెక్టర్లు, హెచ్ ఓ డి లు, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎం.బి.ఏ అధ్యాపకులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.