తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని అన్ని (50) బీ.సీ. స్టడీ సెంటర్లలో గ్రూప్ III, IV కోసం ఆఫ్లైన్ కోచింగ్ ప్రోగ్రామ్ 15.09.2022న ప్రారంభించబోతున్నట్లు హైదరాబాద్లోని TSBCESDTC డైరెక్టర్, కె. అలోక్ కుమార్ తెలియజేశారు. బీ.సీ. స్టడీ సర్కిల్ ప్రత్యక్ష ఉచిత శిక్షణ కోసం, 2022 సెప్టెంబర్ 15 నుండి 17 వరకు స్పాట్ అడ్మిషన్ను ఏర్పాటు చేస్తుంది.
డిగ్రీ ఉత్తీర్ణులైన అర్హులైన అభ్యర్ధులు తమ దరఖాస్తును నేరుగా విద్యార్హతల ధృవీకరణ నకళ్లతో పాటు ఆదాయ మరియు కుల ధృవీకరణ పత్రాలతో వాక్-ఇన్-అడ్మిషన్ గా సమీపంలోని స్టడీ సెంటర్లో సమర్పించవచ్చు. తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.5.00 లక్షలలోపు ఉండాలని తెలిపారు. స్టడీ సెంటర్ల వివరాల కోసం “www.tsbcstudycircle.cgg.gov.in” ని సందర్శించ వచ్చు ఇప్పటికే వేలాదిమంది ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు.