ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్వగ్రామస్తుడిపై కాల్పులు..

0
159

మునుగోడు మండలంలో కాల్పుల కలకలం రేగింది. ఓ యువకుడు బైక్‌ పై వెలుతుండగా కొందరు దుండగులు అతని పై కాల్పులకు తెగబడ్డారు. బాధితుడికి తీవ్రగాయాలవడంతో.. హుటా హుటిన సమీపంలోని నార్కెట్‌పల్లి ఆసుప్రతికి తరలించారు. స్థానిక సమాచారంతో..పోలీసులు అక్కడ చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి మునుగోడులో కూల్‌డ్రింక్స్‌, నీటి బాటిళ్లను విక్రయిస్తూ.. దీంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. రోజులాగే రాత్రి దుకాణం మూసేసి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో మునుగోడు మండలం సింగారం శివారు దాటగానే కొందరు ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే.. లింగస్వామి చనిపోయినట్లు భావించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే అక్కడే స్వామి అనే వ్యక్తి ఈఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు.

read also: <a href=”https://ntvtelugu.com/sports/india-at-common-wealth-games-2022-3-209951.html”>Common Wealth Games 2022: కామన్‌వెల్త్‌లో దూసుకెళ్తున్న భారత్.. 20 పతకాలు కైవసం</a>

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో వున్న బాధితులు లింగస్వామిను నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లుగా సమాచారం. అయితే.. ఘటన జరిగిన స్థలం వద్ద ఓ బుల్లెట్‌ ను పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితుల కోసం గాలింపు చేపట్టామని నల్గొండ డీఎస్పీ నర్సింహరెడ్డి తెలిపారు. అయితే.. బాధితుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్వగ్రామమైన బ్రహ్మణవెల్లంల గ్రామానికి చెందిన లింగస్వామిగా గుర్తించారు. కామినేని ఆసుపత్రి వద్దకు వెళ్లి పరిశీలించారు. బాధితుడుతో మాట్లాడారు.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో పాటు మరికొందరిపై అనుమానం ఉందని బాధితుడు డీఎస్పీకి తెలిపారని సమాచారం. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
<a href=”https://ntvtelugu.com/national-news/whats-today-updates-as-on-august-5th-2022-209953.html”>What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?</a>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here