హైదరాబాద్‌లో కుండ పోత వర్షం కురుస్తోంది.. సుమారు రెండు గంటలకు పైగా కురిసిన వర్షంతో హైదరాబాదీలు నకకం చూశారు.. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జమలయంగా మారిపోవడంతో.. చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.. ఇక, హైదరాబాద్‌లో రాత్రి 10 గంటల వరకు నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. అత్యధికంగా రామంతాపూర్‌లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.. మాదాపూర్‌లో 4.1, హఫీజ్‌పేట్‌లో 3.6, చార్మినార్‌లో 2.8, సరూర్‌నగర్, ఎల్బీనగర్‌లో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.. ఇక, ఈ సీజన్‌లో తొలిసారి హైదరాబాద్‌కు రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. సిటీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది..
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని 14 జిల్లాల్లో శనివారం అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్‌లో వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 3 రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉందని పేర్కొంది ఐఎండీ.. ఇక, తెలంగాణకు రెడ్ అలెర్ట్‌తో పాటు గ్రీన్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు కూడా ప్రకటించింది ఐఎండీ.. కాగా, తీవ్రమైన లేదా ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్న సమయాల్లో కంటే దుగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది ఐఎండీ.. ఇవాళే భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మరి రేపటి పరిస్థితి ఏంటి? అనే ఆందోళన మొదలైంది.