నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా, పశ్చిమ బంగాల్ తీరంలో కొనసాగుతుండటంతో.. దీని ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మరో 2రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశముందని సూచించింది. అయితే.. తాజాగా అల్పపీడనంతో మరో 2రోజులు 17, 18 తేదీల్లో వర్షంతో కూడిన వాతావరణం ఉంటుందని ప్రకటించింది. అయితే.. జూలై 15 వరకే భారీ వర్షా లు ఉంటాయని తొలుత అంచనా వేసినా.. మళ్లీ తాజాగా మరో అల్పపీడనం ఏర్పడడంతో వర్షాలు పడే అవకాశం ఉందని, వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రజలకు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే.. శుక్రవారం ఒరిస్సా తీరంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం, నిన్న (శనివారం) వాయువ్య బంగాళాఖాతంలోని ఒరిస్సా – పశ్చిమ బెంగాల్ వరకు కొనసాగుతోంది. ఈనేపథ్యంలో.. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించివున్న ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చిరించింది.