భార్యపై భర్త చేతబడి.. బాబా సహాయంతో.. ఆమెపై

0
108

భార్యా భర్తలు అంటేనే చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరికి అండగా వుండాలి. కానీ అలాంటి కాలం ఇప్పుడు లేదు. ఏదో ఒక కారణం ఒకరినొకరు అర్థం చేసుకునే తీరు మారింది. నువ్వంటే నువ్వెంత అనే కాలంలో బతుకుతున్న రోజులు వచ్చాయి. దానికి తోడు అక్రసంబంధాలు. ఇంట్లోనే వేరొకరితో సంబంధం. లేదా పరిచయమైన వారితో.. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇప్పటి కాలంలో వందకు వంద శాతంగా మారింది. పిల్లలు తప్పు చేస్తే సరిద్దిద్దాల్సిన పెద్దలే తప్పుటడుగు వేస్తున్నారు. మొన్న కొడుకు గర్ల్‌ ప్రెండ్‌తో నాన్న పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కిరిని దిగ్భాంతిని కలిగించింది. అటు జీవన పరిణామాలు మన దేశంలో చోటుచేసుకుంటున్నాయంటే ఆశ్చర్యపోక తప్పదు. కొందరు ఒకరికి తెలియ కుండా మరొకరితో సంబంధాలు పెట్టుకుని పబ్బం గడుపుతుంటే మరికొందరు ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మోసానికి పాల్పడుతున్నారు. రెండో పెళ్లికి అడ్డున్నాడనే భర్తను ప్రియుడితో చంపిన ఘటన మరువక ముందే.. రెండో పెళ్లికి అడ్డుగా వున్న భార్యను చేతబడి చేసిన మహాప్రభువు వెలుగులోకి వచ్చాడు. ఈఘటన భాగ్యనగరంలో చోటుచేసుకుంది.

ఇక పూర్తీ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని పాతబస్తీలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని భార్యపై భర్త క్షుద్రపూజలకు పాల్పడ్డాడు. భార్యను చంపేందుకు చేతబడి ప్రయోగం చేయించాడు. బాబా సాయంతో భార్యపై చేతబడి పూజలు చేయించాడు భర్త. స్థానిక సమాచారంతో కామాటిపురా పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడి ఇంటిపై దాడి చేశారు. దొంగ బాబాను, భర్తను అదుపులో తీసుకున్నారు. చేతబడి నుంచి మహిళను రక్షించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరి రెండో పెళ్లికి అంగీరించిన ఆమె ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. అయితే భర్తే ఇలా చేయించాడా? లేక వేరొకరి హస్తం కూడా ఈ చేతబడికి ప్రేరేపించారా? అనేకోణంలో పోలీసులు విచారించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here