CP CV Anand: మరోసారి భారీగా డ్రగ్స్.. లిస్టులో రాజకీయ, వ్యాపార, సినిమా రంగంవారు..!

0
131

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ మరోసారి పట్టుబడింది. డార్క్ వెబ్ ద్వారా కన్జూమర్స్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. గోవా, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన డ్రగ్ పెడ్లర్స్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్‌తో పాటు ఆరుగురు హైదరాబాద్ వాసులు అదుపులో తీసుకున్నారు. దేశవ్యాప్తంగా డార్క్ వెబ్ ద్వారా వేలాది మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. డార్క్ వెబ్ నెట్‌వర్క్‌ను హెచ్‌న్యూ టీమ్ రంగ ప్రవేశంతో బట్టబయలు చేశారు. పోలీసులకు చిక్కిన వారంతా ఉన్నత విద్యావంతులే అవడంతో షాక్‌కు గురయ్యారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగిస్తున్న 30 మందిని గుర్తించామని సీపీ చెప్పారు.

ఈ వ్యవహారంలో.. రాజకీయ, వ్యాపార, సినిమా రంగాలకు చెందినవారు ఈ వినియోగదారుల లిస్టులో ఉన్నారని స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగదారులపై కూడా కేసులు పెడుతున్నామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారంతా ఉన్నత చదువులు చదివి, సంపన్నులుగా ఉన్నవారే అన్నారు. వారి వద్దనుంచి 140 గ్రామ్స్ చరస్, 1450 గ్రామ్స్ గాంజా, 184 బ్లాట్స్ LSD, 10 గ్రామ్స్ ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నామన్నారు. వినియోగదారులు వీటిని డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్స్ చేసుకుంటూ.. క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారని సీపీ తెలిపారు. ఈ నెట్ వర్క్ కి లీడర్ నరేంద్ర ఆర్య.. ఇతను గోవాలో ఉంటూ నెట్ వర్క్ నడిపిస్తున్నాడు. ఇతనికి దేశవ్యాప్తంగా 4వేల వినియోగదారులున్నారు, మన దగ్గర హైదరాబాద్ లో ఐదుగురు వినియోగదారులున్నారు సీపీ తెలిపారు. అంతేకాకుండా..ఆర్డర్ పేమెంట్ చేసిన తర్వాత కొరియర్ ద్వారా డ్రగ్స్ ని పంపిస్తున్నారు.. కొరియర్ ఏజెన్సీలు కూడా స్కానర్స్ పెట్టుకొని కొరియర్స్ లో ఏమున్నాయో చూసుకోవాలని సీపీ సూచించారు. ఇక పెడ్లర్స్ మామూలు కొరియర్స్ లాగా డ్రగ్స్ ని కొరియర్స్ లో పంపుతున్నారని, నెల రోజుల్లో 600 మంది డ్రగ్ యూజర్స్ ని గుర్తించామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here