ప్రయాణికులను త్వరగా గమ్య స్థానాలకు చేర్చేందుకు, హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఏర్పాటైన మెట్రో రైలు పరుగులు పెడుతుండటంతో.. మెట్రో స్టేషన్లకు కూడా ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది. ప్రస్తుతం నడుపుతున్న మెట్రో రైళ్లు సరిపోవడం లేక కిక్కిరిసి మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఎక్కువసేపు మెట్రోస్టేషన్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే కొంత కాలంగా.. మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే మెట్రో నేడు కదలనని మెండికేసింది. సాంకేతిక లోపంతో మెట్రో చక్రం ముందుకు కదల్లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. హైదరాబాద్ లోని మియాపూర్, ఎల్బీ నగర్ మార్గంలో సేవలు సుమారు 20 నిమిషాలుగా నిలిచిపోయాయి. దీంతో.. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్తున్న రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపేశారు. ఖైరతాబాద్, మలక్పేట, లక్డీకపూల్ పలు స్టేషన్లలో రైల్లు ఆగిపోయాయి. రైళ్లు తిరిగి బయల్దేరేందుకు కాస్త సమయం పడుతుందని మెట్రో సిబ్బంది అనౌన్స్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. సులువుగా ప్రయాణించేదుకు భాగ్యనగర వాసులు తొందరగా గమ్యాన్ని చేరేందుకు మెట్రో ఉపయోగపడుతుండటంతో మెట్రో ప్రయాణించేందుకు సుముఖత చూపుతున్న నేపత్యంలో మెట్రో ఆగిపోవడంతో ప్రయాణకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇలానే జరిగిందని అధికారులు మాత్రం పట్టించుకోలేదని అన్నారు. త్వరగా వెల్లేందుకే మేము మెట్రో ఎక్కుతామని ఇలా సాంకేతిక లోపంతో సమయం వృధా అవుతుందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా మెట్రో అధికారులు స్పందించి మళ్లీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.