నైజీరియన్లపై హైదరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం

0
217

నైజేరియన్స్‌పై హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసాలు ముగిసినా ఇండియాలో ఉంటున్న నైజీరియన్‌లను వారి దేశాలకు పంపుతామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. నైజీరియన్లు పదేపదే నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఐదుగురిని వారి దేశానికి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. మన దేశంలోకి వచ్చి అక్రమంగా ఉంటున్నారని, వీసాలు గడవు ముగిసిన తరువాత నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో వీరు బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేశారని స్పష్టం చేశారు.

ఎయిర్ టికెట్లు కొనుగోలు చేసి స్వయంగా వారిని వారి దేశానికి అప్పగిస్తున్నామని తెలిపారు. 2500 మంది ఆఫ్రికన్స్ ఉంటే అందులో 750 మంది పైగానే వీసాలు గడువు ముగిసిన వారు ఉన్నారన్నారు. కార్డెన్స్ సెర్చ్ చేసి మిగిలిన వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. వీరిపై కేసులు లేకుండా వారిని వారి దేశాలకు పంపుతున్నామని తెలిపారు. వీరిపై కేసులు పెడితే వారిని వారి దేశానికి పంపడానికి ఇబ్బంది ఉంటుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తే , బెయిల్‌పై బయటికి వచ్చాక మరి నేరాలు చేస్తున్నారని సీపీ వివరించారు. వారిని పట్టుకుని వారిదేశాలకు పంపించడం వల్ల నేరాల సంఖ్యతగ్గే అవకాశం వుందని పోలీసులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here