లవర్స్‌ చాటింగ్‌ ఎఫెక్ట్‌.. ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిచిపోయిన విమానం..

0
664

ఎవ్వరిపని వాళ్లు చూసుకుంటే బెటర్‌.. పక్కోడి జీవితంలో.. పక్కోడి ఫోన్‌లో తోంగిచూసినా.. కొన్ని ఊహించని ఘటనలు జరుగుతాయని అనడానికి ఇదే ఉదహరణ.. ఎందుకంటే.. ఇద్దరు లవర్స్‌ సరదాగా చాట్‌ చేసుకుంటుంటే.. పక్కన సీట్లో ఉన్న వ్యక్తి తొంగిచూసి.. ఆందోళన చెంది.. భయంతో వణికిపోయి.. ఎగరాల్సిన విమానం.. సమయానికి వెళ్లకుండా ఆగిపోవడానికి కారణం అయ్యాడు.. ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే.. లవర్స్‌ అన్నాక.. అనేక విషయాలపై ఫోన్లు, చాటింగ్‌లు, మీటింగ్‌లు జరుగూతనే ఉంటాయి.. ప్రేమగా.. ఫన్నీగా.. తిట్లు, ఏడుపులు, పెడబొబ్బలు.. నిక్‌ లేమ్‌లు.. ఇలా గంటల తరబడి కాల్స్‌ మాట్లాడడం.. చాటింగ్ చేసుకోవడం మామూలైన విషయమే.. అయితే, ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన సరదా చాటింగ్‌ ఇప్పుడు ఏకంగా విమానాన్నే ఆపేసింది.. విషయం ఏంటంటే.. ఇద్దరి మధ్య చాటింగ్‌ బాగానే ఉంది.. కానీ, ఆ చాటింగ్‌ను పక్క వ్యక్తి తొంగిచూడడంతోనే అసలు సమస్యకు కారణమైంది..

ప్రేమికుల చాటింగ్‌తో ఆరు గంటల పాటు విమానం నిలిచిపోయిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 14వ తేదీన ఆదివారం మధ్యాహ్నం మంగళూరులో ఈ ఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఒక విమానం మంగళూరు నుంచి ముంబై బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది.. కానీ, అప్పుడే ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగిన చాటింగ్ విమానం ఎగరకుండా ఆపేసింది.. ఓ యువకుడు, తన ప్రేయసితో సరదాగా చాటింగ్ చేస్తున్నాడు.. తన ప్రేయసి కూడా అదే ఎయిర్‌పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు మరో విమానం కోసం ఎదురు చూస్తున్నారు.. అయితే, ఇద్దరూ సరదాగా అక్కడి సెక్యూరిటీ గురించి వాట్సాప్‌లో చాటింగ్‌ చేసుకున్నారు.. అందులో ‘యు ఆర్ ద బాంబర్’ అంటూ తన ప్రియుడికి మెసేజ్‌ చేసింది ప్రేయసి.. ఆ మెసేజ్‌ను ఆ యువకుడి పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి చూడడమే అసలు సమస్య కారణం అయ్యింది.. అది చూసి భయంతో వణికిపోయిన సదరు ప్రయాణికుడు ఆ యువకుడు నిజంగానే బాంబర్ అయ్యుండొచ్చని కంగారుపడిపోయాడు.. వెంటనే ఆ విషయాన్ని విమాన సిబ్బందికి చేరవేశాడు.. ఇకేముందు.. అనుకున్నదే జరిగింది.. ఎగరాల్సిన విమానం.. ఎయిర్‌పోర్ట్‌లోనే ఆగిపోయింది.. ఆ తర్వాత విమాన సిబ్బంది, భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.. ముందు జాగ్రత్తగా విమానం నుంచి ప్రయాణికుల్ని దించేసి, లగేజీతోపాటు విమానం మొత్తం పూర్తిగా తనిఖీ చేశారు. అయితే, ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. సదరు యువకుడినే కాదు.. అతడితో చాటింగ్‌ చేసిన పాపానికి అతగాడి ప్రేయసిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.. దీంతో ఆమె బెంగళూరు విమానం కూడా వెళ్లిపోయింది.. చివరకు విమానంలో ఎలాంటి బాంబు లేదని, అతడు బాంబర్ కాదని.. అదంతా సరదా సంభాషణగా తేల్చేసిన భద్రతా సిబ్బంది.. ఆరు గంటలు ఆలస్యంగా ముంబైకి విమానం బయల్దేరిందన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here