ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ విద్యాసంస్తలలో 21 వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో యాజమాన్యం సిబ్బంది మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల వైస్ చైర్మన్ గగన్ దీప్ సింగ్ కోహ్లీ పాల్గొని విద్యార్థులను మరియు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. విద్యాసంస్థల యొక్క నాణ్యమైన విద్య పని తీరు తద్వారా పొందినటువంటి యూజీసీ, యెన్ బీ ఏ, న్యాక్ అక్రిడేషన్ తో సహా అనేక అవార్డులు పొందిందని సంతోషం వ్యక్తం చేస్తూ ఇందుకు తోడ్పడిన సిబ్బందిని మరియు ఉత్తమ ర్యాంకులు తెచ్చుకొని కళాశాల ఉన్నతికి పాల్పడి రాష్ట్రంలోనే ఉత్తమ విద్యాసంస్థగా నిలిపినందుకు విద్యార్థులను అయన అభినందించారు.
భవిష్యత్తులో నాణ్యమైన వృత్తిపరమైన విద్యను అందించి విద్యార్థులను అందుకు అనుగుణంగా తీర్చిదిద్ది దేశ పురోభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని నెలకొల్పే దిశగా ప్రేరేపించి క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తయారు చేయవలసిన భాద్యత ఉపాధ్యాయ సిబ్బంది మీద ఉందన్నారు. అందుకు ఇంకా శ్రమించి పని చేయవలసిన అవసరముందని ఈ సందర్బంగా అయన సూచించారు. అలాగే ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ ఈ సంవత్సరంలో ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా 103 ప్లేసెమెంట్ డ్రైవ్‌లు నిర్వహించి 1100 పైన విద్యార్థులకు ప్లేసెమెంట్ రావడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ అత్యధిక ప్యాకేజీ 16.5 లక్షలు సంవత్సరానికి పొందిన విద్యార్థిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ ఎస్ సాయిని మాట్లాడుతూ అకాడమిక్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యార్థులను మరియు సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ కె వెంకట్ రావు ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి , జాయింట్ డైరెక్టర్ డాక్టర్ P పార్థసారధి , డాక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ , డీన్ ఆర్ అండ్ డి డాక్టర్ రంగనాయకులు, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ రిషిసాయల్ మరియు అన్ని విభాగాల అధిపతులు ఈ వేడుకలో పాల్గొని విద్యార్థులను ఉత్తేజ పరిచే ప్రసంగాలు చేసారు. సిబ్బందిని గౌరవించి సత్కారాలు చేసిన తర్వాత విద్యార్థులు వారి వారి ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు.