హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కలకలం.. మోదీ డాక్యుమెంటరీ ప్రదర్శన.. అధికారుల విచారణ

0
777

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీ‌యూ)లో కలకలం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ను ప్రదర్శించడం వివాదాస్పదం అయింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. యూనివర్సిటీలో కొంతమంది ప్రధాని మోదీ డాక్యుమెంటరీని ప్రదర్శించారని క్యాంపస్ అధికారులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఫిర్యాదు చేసింది. దీంతో మరోసారి హెచ్‌సీ‌యూ వార్తల్లో నిలిచింది. ఫ్రాటర్నిటీ గ్రూప్స్ అయిన స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్(SIO), ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్(MSF) విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం గుర్తింపు.

కేంద్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీ ప్రసారాన్ని కేంద్రం బ్లాక్ చేసిన కొద్ది రోజుల తర్వాత క్యాంపస్ లో ప్రదర్శించడంపై విద్యార్థి సంఘాల మధ్య ఉద్రక్తత తలెత్తింది. కొంతమంది విద్యార్థులు కావాలని డాక్యుమెంటరీని ప్రదర్శించారని ఏబీవీపీ ఆరోపిస్తూ వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఫిర్యాదు అందినట్లు, నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు యూనివర్సిటీ అడ్మినిస్టేషన్ వెల్లడించింది. ఆ తరువాత చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇదిలా ఉంటే సిరీస్ బ్యాన్ ముందే దీన్ని ప్రదర్శించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది.

2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బీబీసీ ప్రధాని మోదీ పాత్రపై ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ అల్లర్లలో మోదీ పాత్ర ఉందంటూ తప్పుడు ప్రచారం చేపడుతోందని పలు వర్గాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఈ కేసులో మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా బీబీసీ ఇలాంటి డాక్యుమెంటరీ రూపొందించడంపై అటు యూకేలో, ఇటు ఇండియాలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం ఈ వీడియోను బ్లాక్ చేయాలని ట్విట్టర్, యూట్యూబ్ లను ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here