హీరో మహేష్ బాబుకి మాతృ వియోగం.. తల్లి ఇందిరా దేవి కన్నుమూత

0
129

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్‌ స్టార్‌ కృష్ణ భార్య, మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి మరణించారు. ఆమె కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. ఇందిరాదేవిని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఇందిరాదేవి మరణించారు. కృష్ణ ఇందిరా దేవి కి 1961లో హీరో కృష్ణతో వివాహం జరిగింది. వీరికి రమేష్ బాబు, మంజుల, మహేష్ బాబు లు జన్మించారు. కృష్ణ ఆ తర్వాత 1969 లో విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక 2019లో విజయనిర్మల కన్నుమూసింది. ఆ తర్వాత లాక్ డౌన్ టైంలో మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా మరణించారు. ఇక ఇప్పుడిప్పుడే ఘట్టమనేని ఫ్యామిలీ చనిపోయిన వారి బాధ నుండి బయట పడుతున్న టైంలో ఇందిరాదేవి ఆరోగ్యం సీరియస్ అవ్వడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా కంగారు పడ్డారు. మెరుగైన చికిత్స కోసం ఇందిరాదేవిని ఆసుపత్రికి తరలించారు. కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్న ఆమె నిన్ని రాత్రి మరణించినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో రెబల్‌ కృష్ణం రాజు మరణం తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిత్ర పరిశ్రమ ఇందిరాదేవి మరణంతో మళ్లీ తీవ్ర విశాదంలో వెల్లింది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు తల్లి ఇందిరా దేవి అంటే చాలా ఇష్టం. ఎలాంటి సందర్భం అయినా తన తల్లి గురించి మాట్లాడకుండా మహేష్ బాబు ఉండలేడు. అలాగే తల్లిదండ్రుల విషయం వచ్చే సరికి మహేష్ బాబు చాలా ఎమోషనల్ అయిపోతాడు. తల్లిదండ్రులంటే మహేష్ బాబు కి అంత ప్రేమ. ఇక సితార గౌతమ్ లకు కూడా నానమ్మ ఇందిరాదేవి అంటే చాలా ఇష్టం. టైం దొరికినప్పుడల్లా ఆమెతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈనేపథ్యంలో.. ఇందిరాదేవి మృతితో కుటుంబ సభ్యులంతా శోక సముద్రంలో మునిగిపోయారు. ఆమె నివాసానికి చేరుకుని సంతాపం తెలియజేస్తున్నారు. త్వరలో ఇందిరాదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here