రక్తదాన శిబిరాల్లో యువత ఎక్కువగా పాల్గొనాలి

0
271

ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ విద్యాసంస్తలలో ఈరోజు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు వారి ఆధ్వర్యంలో యాజమాన్యం వారి సహకారంతో మెగా రక్త దాన శిభిరం ఏర్పాటుచేయడం జరిగింది, మన ప్రాణాలకు రక్తం ఎంత అవసరమో అందరికి తెలిసిందే, ఇలాంటి రక్తం కొందరిలో తక్కువగా ఉంటుంది అలాగే కొందరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.

అలాంటి ఆరోగ్యవంతుల నుండి తీసిన రక్తం అత్యవసర సమయంలో ప్రాణాలతో పోరాడుతున్న వారికి తిరిగి ప్రాణం పొసే ఒక పవిత్రమైన కార్యమని అందుకే రక్త దానం చేయండి ప్రాణాలను నిలబెట్టండి అనే ప్రత్యేక నినాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారంలోకి తేవడం జరిగిందని నిర్వాహకులు ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన విద్యా సంస్థల వైస్ చైర్మన్ గగన్ డీప్ సింగ్ కోహ్లీ స్వయంగా తన రక్తాన్ని దానం చేసిన తర్వాత పవిత్ర ఆశయంతో పనిచేస్తున్న సంస్థ ను అభినందిస్తూ రక్త దానం సరిసమానంగా ప్రాణదానం లాంటిదన్నారు.

రక్త దానం ద్వారా సేకరించిన రక్తాన్ని ప్రమాదాలకు గురైన వారికి, పిల్లలకు మరియు పెద్దలకు చేసే శస్త్రచికిత్సలకు, రక్త హీనత ఉన్నవారికి, తలసీమియా మరియు కాన్సర్ వ్యాధి గ్రస్తులకు చాల అవసరమని సమయానికి వారికి తగిన రక్తం అందక చాల మంది ప్రాణాలను వదలడం చాలా బాధాకరమైన విషయం అని చెపుతూ ఆరోగ్యవంతులుగా ఉన్న ప్రతి వ్యక్తి రక్తదానం చేయాలనీ అయన పిలుపునిచ్చారు. విద్య సంస్థల ద్వారా సేవ దృక్పధం కోసం చేస్తున్న ఇలాంటి మహత్కార్యానికి విద్యార్థులు మరియు సిబ్బంది కూడా తోడ్పాటును అందించి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మరిన్ని చేయాలన్నారు.

అందుకు తమ సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. మంచి ఉద్దేశంతో  చేస్తున్న ఈ రక్తదాన శిబిరానికి మరియు స్వయంగా వైస్ చైర్మన్ పాల్గొనడం ద్వారా ప్రేరణ పొందిన విద్యార్థులు, సిబ్బంది స్వచ్చందంగా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. విద్యార్థులు మరియు సిబ్బంది ద్వారా సేకరించిన 150 యూనిట్ల రక్తాన్ని నిర్వాహకులకు అందచేసి అత్యవసర సమయాల్లో ఉపయోగించాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కే వెంకట్ రావు , డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి , ప్రిన్సిపాల్ , డాక్టర్ పార్థసారధి, జాయింట్ డైరెక్టర్, డాక్టర్ పమేలా చావ్లా, అసోసియేట్ డైరెక్టర్ , డాక్టర్ ఆంజనేయులు,విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here