Breaking News : రేపే టెట్‌ ఫలితాలు.. ఎన్ని గంటలకంటే..?

0
219

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఈ నెల 12 వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం 5 సంవత్సరాల తరువాత ఈ ఏడాది టెట్‌ నిర్వహించింది. ఈ సారి టెట్‌ కోసం భారీ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే టెట్‌ ఈ నెల 12న ఉదయం ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1 ఎగ్జామ్ జరగగా.. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 ను నిర్వహించారు అధికారులు. అయితే.. టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సమయంలో టెట్‌ ఫలితాలను జూన్‌ 27న విడుదల చేస్తామని చెప్పడంతో.. అందరు అభ్యర్థులు టెట్‌ ఫలితాలు జూన్‌ 27న విడుదల చేస్తారని వేచి చూశారు.

కానీ.. అధికారులు విడుదల చేసిన ప్రాథమిక కీ లో అభ్యర్థులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. అధికారులు అభ్యంతరాలను పరిశీలించి ఫలితాలను విడుదల చేయడంతో ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే జులై 1వ తేదిన టెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది విద్యాశాఖ. జులై 1న ఉదయం 11.30 గంటలకు టెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు అధికారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here