పోలీసులపై స్వప్న సిస్టర్‌ సీరియస్‌.. గంటలు గడుస్తున్న దొరకని స్వప్న ఆచూకీ

0
105

నిన్న హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి దూకి.. స్వప్న అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఆమె మృతదేహాన్ని ఇప్పటివరకు పోలీసులు వెళికి తీయకపోవడంతో పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటలు గడుస్తున్న ఇప్పటి వరకు స్వప్న మృతదేహం బయట తీయలేదని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు అక్కడ ఏ అధికారి లేకపోవడంపై పోలీసులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై స్వప్న సిస్టర్‌ సీరియస్‌ అయ్యారు. ఆత్మహత్య చేసుకునే వరకు పోలీసులు చూసుకోకుండా ఏమి చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. గంటలు కావొస్తున్న స్వప్న ఆచూకీ దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వప్న గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధ పడుతుంది.స్వప్న కు భర్తతో విడాకులు అయ్యాక డిప్రెషన్ కు గురి అయింది. ఆ క్షణం నుండి స్వప్నను కాపాడుకుంటూ వస్తున్నామని స్వప్ప సిస్టర్‌ వాపోయింది. నేడు మరోసారి స్పీడ్ బోట్స్, డిఆర్ఎఫ్ సిబ్బందితో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దుర్గం చెరువులో బురద ఎక్కువగా ఉండడంతో మృతదేహం చిక్కుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్వప్న మృతి దేహం కోసం గాలింపు చర్యలను స్పీడ్‌ పెంచినట్లు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here