చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌.. నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

0
126

హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద నిర్మించిన చాంద్రాయణగుట్ట ఫ్లైఓవరు మంత్రి కేటీఆర్ నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. రూ.45.90 కోట్లతో 674 మీటర్ల పొడవునా ఈ ఫ్లైఓవర్ను నిర్మించగా.. ఈ ఫ్లెఓవర్ ద్వారా చాంద్రాయణగుట్టలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. SRDP ఫలాలు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజల మౌలిక అవసరాలు పూర్తి చేయడంలో బల్దియా లక్ష్యం నెరవేరే అవకాశం దగ్గరలోనే ఉంది. ఈచాంద్రాయణగుట్ట విస్తరణ ఫ్లై ఓవర్ వలన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వెళ్లేందుకు సులభతరమయ్యేందుకు ఈ ఫ్లైఓవర్ దోహదపడుతుంది.

ట్రాఫిక్‌ సమస్యను అధికమించేందుకు చాంద్రాయణగుట్ట వద్ద రూ. 45 కోట్ల 90 కోట్ల వ్యయంతో యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ కలిపి మొత్తం అట్టి వ్యయంతో ఫ్లై ఓవర్ ను చేపట్టారు. ఈనేపథ్యంలో.. ఫ్లై ఓవర్ 4 లైన్లను రెండు వైపుల 674 మీటర్ల పొడవు తో నిర్మాణం చేశారు. తద్వారా కందికల్ గేట్, బర్కాస్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఆగకుండా నేరుగా ఈ ఫ్లైఓవర్ పై నుండి వెళ్లవచ్చు. ప్రస్తుతతం ఉన్న ఫ్లైఓవర్ అప్రోచ్‌ చివరిలో ట్రాఫిక్‌ రద్దీ నివారించడానికి ఫ్లైఓవర్ ను పొడిగించడం జరిగింది. కుడి వైపున దర్గ, డిఎల్‌ఆర్‌పి, ఎడమ వైపున మసీదు, మందిర్‌ ఉండడం మూలంగా వాహనదారుల ప్రమాదాలను నివారించడమే కాకుండా ట్రాఫిక్‌ రద్దీని తొలగించడానికి ఉపయోగపడుతుంది. చాంద్రాయణగుట్ట వద్ద ₹ 45.90 కోట్లతో నిర్మించిన 674 మీటర్ల పొడవైన ఫ్లై ఓవర్‌ను నేడు ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లో మరిన్ని మౌలిక సదుపాయాలను జోడించడంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డిపి) కీలకమైందని కేటీఆర్ ట్విట్ చేశారు.

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here