వినూత్న ఆలోచనలకు వేదికైన అంతర్జాతీయ సదస్సు

0
146

గీతం అంతర్జాతీయ సదస్సు ముగింపు ఉత్సవంలో కేయూ డీన్ ప్రొఫెసర్ మల్లారెడ్డి పాల్గొన్నారు. కేతికత పురోగమిస్తున్న కొద్దీ అంతర్ విభాగ పరిశోధనలు, జ్ఞానానికి ప్రాముఖ్యం పెరిగిందని వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ మల్లారెడ్డి అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘గణిత శాస్త్రాలు, సాంకేతిక పరిజ్ఞానంలో పెరుగుతున్న వినియోగం’ (‘Mathematical Sciences and Emerging Applications in Technology (ICMSEAT-2022) అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ఆదివారంతో ముగిసింది. ఆంధ్రప్రదేశ్- తెలంగాణ గణితశాస్త్ర సంఘం (ఏపీటీఎస్ఎంఎస్) సహకారంతో గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ని గణిత శాస్త్ర విభాగం నిర్వహిస్తున్న ఈ ముగింపు ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, విజయవంతంగా సదస్సును నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. అలాగే ఏపీటీఎస్ఎంఎస్ సేవలను, దాని వ్యవస్థాపకులను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు.

గౌరవ అతిథిగా పాల్గొన్న ఏపీటీఎస్ఎంఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎన్. కిషన్ మాట్లాడుతూ, సదస్సులో జ్ఞానాన్ని పెంపొందించి, వినూత్న ఆలోచనలను రేకెత్తించేలా ప్రముఖుల ఆతిథ్య ఉపన్యాసాలు ఈ మూడు రోజులపాటూ కొనసాగాయన్నారు. ఈ సరస్సు పరిశోధక విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని ఏపీటీఎస్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి. జయసుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు.

అధునాతన పరిశోధనలు, కొత్త విషయాలను తెలుసుకోవడానికి, కొంగొత్త స్నేహాలు ఏర్పడడానికి ఈ సదస్సు తోడ్పడిందన్నారు గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాతి కెనగే. ఈ సదస్సును నిర్వహించేందుకు అవకాశమిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఏపీటీఎస్ఎంఎస్ కార్యవర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అంతర్జాతీయ సదస్సు నివేదికను కన్వీనర్ ప్రొఫెసర్ బీఎంనాయుడు సమర్పించగా, కార్యదర్శి డాక్టర్ సి. నారాయణస్వామి వందన సమర్పణ చేశారు. మరో నిర్వాహకుడు డాక్టర్ రెడ్డి తేరి ,గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజు, డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి తదితరులు సదస్సు నిర్వహణలో తోడ్పడ్డారు. ఇతర పరిశోధకులు ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి, సరిచేహ నివృత్తికి, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ సదస్సు. దోహదపడినట్టు తమ ప్రతిస్పందన సీడ్ బ్యాక్టీ) మిజోరాం ఎన్ఐటీ నుంచి వచ్చిన రాధ అభిప్రాయపడ్డారు. సదస్సును ప్రణాళికాబద్ధంగా, ఉపయుక్తంగా నిర్వహించి కొంగొత్త అంశాలు నేర్చుకోవడానికి వీలుకలిగినట్టు పిఠాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఏ శ్రీకుమార్ చెప్పారు.

సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరితో పాటు వజ్ర సమర్పణకు అధ్యక్షత వహించిన వారికి కూడా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఏపీటీఎస్ ఎంఎస్ కార్యనిర్వాహక సభ్యులతో పాటు ఇతర అతిథులను కూడా పురుగుచ్చాలు, చుళ్ళాలు, జ్ఞాపికలను అందచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here