దొంగతనానికి వచ్చారు.. ఉన్నదంతా దోచుకున్నారు. అయితే ఇంతలోనే ఆకలి అయింది. దొంగలు ఏమనుకున్నారో ఏమో వంటింట్లో దూరారు. ఏమీ తినబండ్రాలు కనబడలేదు. అయితే ఫ్రిజ్లో పాలు కనపడ్డాయి. వాటిని తీసుకొని మరిగించుకొని తాగడమే కాకుండా.. తాగిన గ్లాసులను కడిగి అక్కడే పెట్టి వెళ్లిపోయారు. ఈ దొంగల వ్యవహారాన్ని చూసి పోలీసులు సైతం విస్తుపోయారు.
జగద్గిరిగుట్ట పరిధిలోని ఎల్లమ్మబండలో నీ ఇంటిలో దొంగతనం జరిగింది. పెళ్లి కోసం దాచిన బంగారు, వెండి ఆభరణాలతోపాటు నగదును కూడా దొంగలు దోచుకు పోయారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అసలు తతంగం మొత్తం కూడా దొంగతనం తర్వాతే జరిగింది. దొంగలు వంటింటి లోకి వెళ్లారు. అక్కడ తినుబండారాలు ఏమీ కనబడలేదు. ఫ్రిజ్‌లో ఉన్న పాలను తీసుకొని వేడిచేసుకుని తాగి పోయారు. దొంగతనానికి వచ్చిన వారు తమ పని చేసుకొని పోక వంటింటి ని ఖాళీ చేయడం చూసి స్థానికులు సైతం విస్తుపోతున్నారు.
ఎల్లమ్మబండ కు చెందిన పద్మకు ఇద్దరు కూతుళ్లు. మెహిదీపట్నంలో ఉంటున్న పెద్ద కూతురు కుమారుడు పుట్టినరోజు కావడంతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. పద్మ తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలుపగలగొట్టి కనిపించింది. బీరువా పగులగొట్టి 8 తులాల బంగారం, 30తులాల వెండి, 20వేల నగదు కనిపించలేదు. బిడ్డ పెళ్లికోసం దాచుకున్న సొమ్ము మొత్తం చోరీ కావడంతో పద్మ బోరున విలపించింది. జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.