రామాయణ కథ చెప్పలేక తలపట్టుకున్న జగ్గారెడ్డి

0
192

నేను వైఎస్ వదిలిన బాణం అంటూ జగ్గారెడ్డి మాటలకు స్టేట్మెంట్ ఇచ్చారు షర్మిళ. అయితే షర్మిళ కౌంటర్ కు నేడు జగ్గారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. షర్మిల జగన్ వదిలిన బాణం కాదు.. వదిలేసిన బాణం అని జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో సీఎం అయ్యే అవకాశం లేదు కాబట్టే తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టారని ఆరోపించారు. నేతలను తిట్టేందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. వైఎస్ఆర్ కూతురు కాబట్టి తిడితే మేము ఊరుకుంటామా? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. అనంతరం షర్మిళపై కౌంటర్ ఇచ్చేందుకు శ్రీరామాంజనేయ యుద్దం గురించి చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. శ్రీరాముడికి మహాభక్తుడు హనుమంతుడు. ఆయన ఛాతీలో కూడా సీతారాములను పెట్టుకున్నాడు. అది అందరికి తెలుసు. అంత మహా భక్తులు ఆంజనేయ స్వామి. అయితే వారిద్దరి మధ్య వైఎస్‌ షర్మిళ లాంటి వారు కొట్లాట పెట్టేసిండ్రు.. ఆయనతో ఇద్దరికి యుద్ధం జరిగిందంటూ చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. ఆయుద్దానికి ముందు కౌంట్ వేసుకున్నారు. నీ శిష్యుడు కదా వదిలేసేయ్‌ శ్రీరామ అని అంటే.. శ్రీరామునికి కోపం వస్తుంది. అసలు ఎవరు శిష్యుడు? ఎవరిని వదిలేయాలి? అనే ప్రశ్న చర్చకు దారితీసింది. కోతి లక్షణం పోనించుకోలేదు కదా! ఆంజనేయ అన్నాడట శ్రీరాముడు. నీకోతి బుద్ది కోతి బుద్దే కదా అంటాడు శ్రీరాముడు అని చెప్పుకొచ్చారు. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడట అవును రామా నేను కోతినే.. ఆకోతినే కదా నిన్న భుజాలమీద ఎక్కించుకుని శ్రీరామునితో యుద్ధం చేపించింది అని ఆంజనేయుడు అన్నాడట? అక్కడున్న వారు శ్రీరాముడు కాదు రావణాసురుడు అంటే.. మరి నేనవరిని అన్నాను.. అంటే శ్రీరాముడు అన్నారు అనగానే అవునా సారీ.. అంటూ చాలా తేలిగ్గా తీసిపారేసారు జగ్గారెడ్డి. ఇది శ్రీరామంజనేయ యుద్దం గురించి ఇలా ప్రెస్‌ మీట్‌ లో మాట్లాడుతూ.. రావణాసురుడు తమ్ముడు ఎవడు? అని మళ్లీ అక్కడున్న వారిని అడగడం మొదలు పెట్టారు. ప్రెస్ మీట్ లో ష్మరిళ గురించి సటైర్ వేయబోయి శ్రీరామాంజనేయ కథనే చెప్పి అయోమయంలో పడ్డారు. ఈ మాటలుకాస్త ఇప్పుడు షోసల్ మీడియాలో వైరల్ గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here