Thief Teacher Sangareddy: అతను ప్రభుత్వ ఉద్యోగి. పిల్లలకు విద్యాబోధనలు చెప్పి మంచి నడవడికలు నేర్పించి అభివృద్ధి బాటలో నడిప్పించాల్సిన మాస్టారే అడ్డదారులు తొక్కితే.. ఇంక పిల్లలకు ఏం పాఠాలు నేర్పిశ్తాడు. ఆ మాస్టారుకు ఏం కష్టమెచ్చిందో ఏమో కానీ.. దొంగగా మారాడు. దొంగలకే దొర అయ్యాడు. ఒకసారి కాదు రెండు కాదు అది అలవాటు చేసుకుని తను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనే విషయమే పక్కన పెట్టి దొంగతనాలకు పాల్పడుతుండటంతో సస్పెన్షన్ కూడా చేసిన మారలేదు. ఉపాధ్యాయ వృత్తి పోయిన దొంగ వృత్తి మాత్రం మానుకోలేక పోయాడు. చివరకు ఒక వ్యక్తి నుంచి లక్షల డబ్బును కాజేసి పోలీసులకు పట్టు బడ్డాడు. దీంతో ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది.
Read also: Blocked Jagityala: అష్టదిగ్బందంలో జగిత్యాల.. మాస్టర్ ఫ్లాన్ పై నిరసనలు
కె.రాములు అనేవ్యక్తి సంగారెడ్డిలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. తాజాగా అంటే..10న స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి భార్యతో కలిసి టూ వీలర్ పై బ్యాంక్ కు వచ్చాడు. బ్యాంకు నుంచి ఓ బ్యాంకులో రూ.1.50 లక్షలు డ్రా చేసి తర్వాత టూ వీలర్ పై వెళ్లిపోయాడు. అనంతరం మధ్యలో కూరగాయలు కొనుక్కోవడం కోసం ఆగారు. అయితే బ్యాంక్ దగ్గర నుంచి అతనిని ఫాలో అవుతూ వచ్చిన సార సంతోష్ అనే వ్యక్తి అతని వద్ద వున్న డబ్బుల సంచిని లాక్కొని పారిపోయాడు. దీంతో బాధితులు పోలీస్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసలు సీసీ టీవీ ఫోటేజ్ ను పరిశీలించారు. ఆవీడియోను చూసి అవాక్కయ్యారు. బాధితుని వద్ద డబ్బులు దాక్కొని పారిపోయిన వ్యక్తి జోగిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న సంతోష్ అని గుర్తించారు. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. పక్కస్కెచ్ వేసిన పోలీసులు ఈ నెల 17వ తేదీన నిందితుడిని సంగారెడ్డిలో అదుపులో తీసుకున్నారు. సంతోష్ ను విచారించాగా.. అసలు కథ అంతా వివరంగా చెప్పుకొచ్చాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడై ఉండి కూడా దుర్ఘసనాలకు అలవాటుపడ్డాడని తెలిపారు.
Read also: Kanti Velugu: నేడు కంటి వెలుగు రెండో విడత.. ఆధార్, రేషన్, ఆరోగ్యశ్రీ తప్పనిసరి
అందుకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్లు తేల్చి పోలీసుల ఎదుటే ఒప్పుకున్నాడు. అయితే ఇంకో విషయం ఏంటంటే.. ఇన్ని రోజులు తను చేసిన దొంగతనాలకు పోలీసులు అతన్ని పట్టుకునే వీలులేకుండా చేసేందుకు తన బండి నెంబర్ ప్లేట్ ను తిప్పిపెట్టి తప్పించుకుంటున్నట్లు తెలిపాడు. ఉపాధ్యాయుడు సంతోష్ మీద గతంలో కూడా ఒక కేసు నమోదయింది. సంతోష్ నాలుగు నెలల క్రితం జిల్లాలోని ఓ హెడ్మాస్టర్ సెల్ ఫోన్ కు అసభ్యకరమైన మెసేజ్ లు పంపించాడు. విసిగిపోయిన ఆమె పోలీసులు ఆశ్రయించారు. ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు సారా సంతోష్ ను అప్పుడు సస్పెండ్ చేశారు. అయితే.. రీసెంట్ గా సంతోష్ పది రోజుల క్రితమే విధుల్లో చేరాడు. అయినా తన చేతివాటం మార్చుకోలేక పోయాడు సంతోష్ చివరికి దొంగతనం చేసి పోలీసులకు మళ్లీ పట్టుబడ్డాడు. నిందితుడు సంతోష్ నుంచి రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు సంతోష్ ని రిమాండ్ కు తరలించారు.
Tension in Kamareddy: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుపై కొనసాగుతున్న ఆందోళనలు.. నేటితో కౌన్సిలర్ల రాజీనామాకు డెడ్ లైన్