తెలంగాణలో బతుకమ్మ సంబరాలకు ప్రత్యేక స్థానం ఉంది… తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ఉత్సవాలను ప్రారంభించి 9 రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తూ సద్దుల బతుకమ్మతో ఈ ఉత్సవాలను ముగిస్తారు.. ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ , అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పేర్లతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.. ఈ ఏడాది ఇప్పటికే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.. తెలంగాణ గవర్నర్ తమిళిసై నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ.. మహిళల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు.. అయితే, కొందరు నేతలు బతుకమ్మ ఉత్సవాలు పాల్గొని.. వారు ఆడిన బతుకమ్మపై ట్రోల్స్ తప్పడం లేదు.. తాజాగా, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు.. మునుగోడులో పర్యటనలో ఉన్న ఆయన.. తన కోడలు జ్యోతి బెగల్ తో కలిసి చౌటుప్పల్‌లో స్థానిక మహిళలతో ఉత్సాహంగా కాలు, చేయి కదిపారు పాల్..
అయితే, ఏకే పాల్ బతుకమ్మ ఉత్సవాలు పాల్గొనడం వరకు బాగానే ఉన్నా.. ఆయన బతుకమ్మ ఆడిన విధానంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు… ఆ పాట ఏంటి..? దానికి నువ్వు బతుకమ్మ ఆడుతోన్న విధానం ఎలా ఉంది..? అంటూ ట్రోల్ చేస్తున్నారు… మొత్తంగా బతుకమ్మ ఆడి.. మరోసారి నెటిజన్లకు చిక్కారు కేఏ పాల్.. ఎప్పుడైనా పాల్ పేరు చెబితేనే.. అంతా సెటైర్లు వేస్తుంటారు.. ఇప్పుడు ఇలా మరోసారి వారికి పని చెప్పాడాయన.. కాగా, బతుకమ్మ అంటే.. తీరొక్క పువ్వులు తీసుకొచ్చి.. భక్తితో పేర్చి.. ఆటాపాటలతో.. నిమజ్జనం చేస్తూ ఉంటారు.. కానీ, రానురాను బతుకమ్మ పాటలు కనుమరుగు అవుతున్నాయి.. మట్టిలో నుంచి.. పల్లెల్లో నుంచి పుట్టిన పాటల స్థానంలో ఇప్పుడు డీజే పాటలు గోల చేస్తున్నాయి.. అసలు బతుకమ్మ ఆటను పక్కన పెట్టేసి.. ఇప్పుడు డీజీ స్టెప్పులు వేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.