సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి

0
171

సీఎం కేసీఆర్ గారు ఇచ్చినమాట నిలబెట్టుకోండి అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో వయసు మళ్ళిన ఎవరికైతే పెన్షన్ ఇస్తున్నారో దాంట్లో కొంత మంది అనేక ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని అన్నారు. వాళ్ళ వయసు 65 నుండి 70 సంవత్సరలు ఉంటే అద్దార్ కార్డు లో మాత్రం 55, లేదా 60 లోపుగా ఉన్నాయని గుర్తు చేశారు. ఎందుకంటే ఈ వయసు వారి దగ్గర బర్త్ సర్టిఫికెట్ లేకపోవడం ప్రధాన కారణం అన్నారు. దీనివల్ల వారి వయసు అధార్ కార్డులో వేయడం వల్ల ఇలా రాష్ట్రంలో అనేక మంది పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ కోల్పోతున్నారు. ఈవిషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వీఆర్‌ఏ లను ఇంటింటికి పంపించి వయసు మీరిన వారిని అధార్‌ కార్డులో డేట్‌ మార్చాలని కోరారు. ఇలా చేస్తే చాలా మంది ముసలితనంలో ఉన్న వారు ఆర్ధిక ఇబ్బంది పడుతున్న వారు కూడా లాభం పొందుతారని విన్నవించుకున్నారు. ఇది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టో లో అందరికి పెన్షన్ 3016 రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు రూ. 2016 మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేశారు. రూ.3016 పెన్షన్ అమలు చేయాలని కోరారు. 57 ఏళ్ల వారికి కూడా రూ. 3016 పెన్షన్ అమల్లోకి రావాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలోని వార్డులో, గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి, ఆధార్‌ కార్డులో వయసు తక్కువ, తప్పుగా వచ్చినవారికి ప్రభుత్వమే సవరణ చేసేల చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి కోరారు. ఎన్నో కోట్లు పెట్టి ప్రాజెక్ట్ లు కడుతున్న ప్రభుత్వము ముసలితనంతో ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న భార్యభర్తలకి ఇద్దరికి పెన్షన్ ఇవ్వడం వల్ల ఇంకొకరిపై ఆధారపడకుండా జీవించే అవకాశం ఆముసలితనంతో ఉన్న వృద్దులకు దొరుకుతుందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వం గమనించాలని అన్నారు. రూ.3016 పెన్షన్ ఇస్తామన్నారు సీఎం గారు మీరు మాట ఇచ్చారు నిలబెట్టుకోండని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవి అమలు చేయాలని కోరుతున్నట్లు జగ్గారెడ్డి కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here