గవర్నర్ ను కేసీఆర్ అవమానిస్తున్నారు.. దిగజారి మాట్లాడుతున్నారు..!

0
140

కేసీఆర్ ఈ రోజు ఉంటారు రేపు పోతారు కానీ..వ్యవస్థలు శాశ్వతమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను, సంప్రదాయాలను గౌరవించాలని హితువు పలికారు. గవర్నర్ ని కేసీఆర్ అవమానిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేసారు. కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. మునుగోడులో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ భయపడుతున్నారని, కొడుకును సీఎం చేయలేకపోతున్న అనే ఆందోళనలో ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబానికి మోడీ నచ్చకపోవచ్చు, కానీ దేశ ప్రజలకు మోడీ అంటే ఇష్టమని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ని దేంట్లో ఆదర్శంగా తీసుకోవాలని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరిగిందా? రాష్ట్రంలో సమస్యలే లేవా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిరాశ నిస్పృహ తోనే బండి సంజయ్ యాత్ర పై దాడి జరిపించారని కిషన్‌ రెడ్డి మండిపడ్డారు.

ప్రజాసంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో దశ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నిన్న జనగామ జిల్లాలోని దేవరుప్పుల పాఠశాలలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే.. బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. దీంతో.. సీపీ ఏం చేస్తున్నాడంటూ బండి సంజయ్ సీరియస్ అయ్యారు. ఇంటెలిజెన్స్ వాళ్ళకు మా పాదయాత్ర తెలుసుగా పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే సీఎం కేసీఆర్ రాష్ర్టంలో పాదయాత్ర చేయాలన్నారు. అంతేకాకుండా.. పాదయాత్రలో మహిళ బీజేపీ కార్యకర్తలు ఉన్న కారుపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు రాళ్లతో దాడిలో కార్లు ధ్వంసమైన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here