బండి సంజయ్ ని ఆటాడుకుంటున్న టీఆర్ఎస్.. ఎందుకంటే?

0
121

తెలంగాణలో ఒకవైపు టీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా ఒక సంఘటన టీఆర్ఎస్ కి అంది వచ్చిన అవకాశంగా మారింది. హోంమంత్రి అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందివ్వడంపై సోషల్ మీడియాలో దుమారం రెగుతోంది. గుజరాత్ నేతల కాళ్ళ దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారంటూ టీఆర్ఎస్ పోస్టులు పెట్టింది.. భవిష్యత్తులో అమిత్ షా కాళ్ళ దగ్గర తెలంగాణను తాకట్టుపెడతారనడానికి ఈ సంఘటన ఉదాహరణ అంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.

అమిత్ షాకు ఉరికి ఉరికి చెప్పులు తెచ్చివ్వడం ఏంటని టీఆర్ఎస్ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పై నిప్పులు చెరుగుతున్నారు. ఢిల్లీ “చెప్పులు” మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని – తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది. జై తెలంగాణ!అంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here