మరో లోన్‌యాప్‌ ఏజెంట్‌ కీచక పర్వం..

0
128

లోన్‌ యాప్‌ ఏజెంట్‌ అరాచకాలు ఆగడం లేదు. లోన్‌ ఇస్తూ.. రికవరీ ఏజెంట్ల పేరుతో కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. లోన్‌ తీసుకన్న వ్యక్తి డబ్బులు తిరిగి ఇచ్చినా.. ఇంకా ఇవ్వాలంటూ.. ఒత్తిడి తెస్తున్నారు. లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇప్పటికే పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. పోలీసులు లోన్‌ యాప్‌ రికవరీ ఏజెంట్లను అరెస్ట్‌ చేస్తున్నా.. వేధింపులు మాత్ర ఆగడం లేదు. మొన్నటికి మొన్న ఓ యువతి లోన్‌ యాప్‌ ఏజెంట్ల వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. అయితే.. ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలానికి కు చెందిన కోటేశ్వర శర్మ అనే యువకుని కి మార్పింగ్ న్యూడ్ ఫోటోలు పంపి బ్లాక్‌మెయిల్‌ దిగారు లోన్‌ యాప్‌ ఏజెంట్లు. కోటేశ్వర శర్మ ఇటీవల.. తన వాట్సాప్‌కు పంపిన లింక్ ఓపెన్ చేయడంతో 2200 రూపాయలు అకౌంట్ లో జమ అయ్యాయి.

అయితే.. అకౌంట్లో జమ అయిన ఆరు రోజుల నుంచి లోన్‌ యాప్‌కు సంబంధించిన వ్యక్తి వాట్సాప్ కాల్ ద్వారా కోటేశ్వర శర్మకు ఫోన్ లు మెసేజ్ లు పెడుతున్నాడు. తీసుకున్న లోన్ కు 5,040 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అయితే.. డబ్బులు కట్టకపోతే బంధువులకు స్నేహితులకు ఫోన్లు చేసి మీ స్నేహితుడు లోన్ తీసుకున్న డబ్బులు కట్టడం లేదు అని వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్లు చేసి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడాడు. స్నేహితులను బంధువులను ఇబ్బంది పెట్టలేక కోటేశ్వర్‌ శర్మ ఇప్పటి వరకు 1,5000 కట్టాడు. అయినా కూడా.. లోన్‌ యాప్‌ ఏజెంట్ల దాహాం తీరక.. ఇంకా ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేయడంతో.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో రెండుసార్లు ఫిర్యాదు చేశాడు బాధితుడు కోటేశ్వర శర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here