తెలంగాణలో మరికొద్ది రోజులు భారీవర్షాలు తప్పవని, జాగ్రత్తగా వుండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కుంటలు, చెరువులు, జలాశయాలు నిండుకుండల్లా మారాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కంటాయపాలెం గ్రామంలోని పెద్ద చెరువు అలుగు పోస్తుండడంతో కంటయపాలెం గుర్తూరు లో లెవెల్ రోడ్డు బ్రిడ్జి వద్ద కంటాయపాలెం గ్రామానికి చెందిన పల్లె యాకయ్య (50) పొలం పనులకు వెళ్తూ అలుగు దాటుతున్న సమయంలో, గేదెను కాపాడబోయి తాను గేదెతోపాటు వాగులో పడి కొట్టుకుపోయాడు.
అయితే గేదె క్షేమంగా బయటికి వచ్చింది. అతని ఆచూకీ తెలియకపోవడంతో అధికారులకు సమాచారం అందించడంతో,తొర్రూర్ పోలీసులు రెవెన్యూ అధికారులు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. వ్యక్తి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరఫున వారి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి సంఘటన స్థలాన్ని పరిశీలించారు ఉన్నతాధికారులకు రెస్కు బృందాలతో తొందరగా గాలింపు చర్యలు చేసి వెతుకులాడాలని తెలియజేసి రెండు రోజులుగా పడుతున్న వర్షాలకు చెరువులు అలుగు పోస్తున్నాయి కనుక ఎవరు అలుగుల వద్ద దాటే ప్రయత్నం చేయవద్దని చేపల వేటకు వెళ్ళవద్దని ఆయన కోరారు.