తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి.. ఈ ఉప ఎన్నిక కుట్ర: మంత్రి జగదీష్ రెడ్డి

0
49

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ఉప ఎన్నికల్ని సృష్టించారని.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికే ఈ కుట్రలు, కుతంత్రాలని వ్యాఖ్యానించారు. సస్యశ్యామలం అవుతున్న తెలంగాణలో కొందరు కుయుక్తులు మంటలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హిందు మతం గురించి వేదాలు వల్లించే బీజేపీ ప్రభుత్వం.. యాదాద్రి పునర్నిర్మాణానికి రూ.100 చందా కూడా విదల్చలేదని ఎద్దేవా చేశారు. తాము
హిందు మతానికి అంబాసిడర్లమంటూ ఇతర మతాలపై విషం చిమ్మే బీజేపీ.. యాదాద్రి పునర్నిర్మాణానికి ఎందుకు నిధులు ఇవ్వలేదని ప్రశ్నించారు. గల్లీ గల్లీల్లో కేంద్రమంత్రులు తిరుగుతున్నారని.. కానీ ఏ ఒక్కరు కూడా తెలంగాణ అభివృద్ధికి పైసా విదల్చలేదని మండిపడ్డారు.

రాజగోపాల్ రెడ్డికి రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ కుట్రలకు తెర లేపేందుకు ఆయనకు రూ. 18,000 కోట్లు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ కుట్రలకు అండగా నిలిచినందుకు ఆయనకు అంత మొత్తాన్ని ఇచ్చారన్నారు. ఆ డబ్బులేదో నల్లగొండ జిల్లాకు, మునుగోడుకి ఇస్తే.. నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. ఒకవేళ ఆ డబ్బులు మునుగోడు, నల్లగొండ అభివృద్ధికి ఇస్తే.. తాము ఉప ఎన్నికల బరి నుండి తప్పుకుంటామని ప్రధాని మోడీ, అమిత్ షాలకు ఛాలెంజ్ చేశారు. సీఎం కేసీఆర్‌ని ప్రాధేయపడి, ఉప ఎన్నికల నుంచి తప్పుకోవడానిక ఒప్పిస్తామన్నారు. రాజగోపాల్ రెడ్డి సొంతానికి ఇచ్చే సొమ్ము.. జిల్లా అభివృద్ధికి ఇవ్వమని కోరారు. వడ్డీకి అప్పులు తెచ్చి భవిష్యత్ తరాలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బంది ఉండొద్దన్న సంకల్పంతో నిర్మిస్తున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here