తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు శంషాబాద్‌లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్, ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఫెసిలిటీ సెంటర్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఈ ఫెసిలిటీ ఏర్పాటు కోసం 2018 నుంచి పలుసార్లు సాఫ్రాన్ తో చర్చలు జరిపామని వెల్లడించారు మంత్రి కేటీఆర్. ఎయిర్ క్రాఫ్ట్ విభాగంలో 8 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిందని, 250 మందికి ఉద్యోగాలు కల్పించిందన్నారు మంత్రి కేటీఆర్ . అయితే.. ఇప్పుడు 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండో ఫెసిలిటీ సెంటర్ ని ఏర్పాటు చేసిందని వెల్లడించిన కేటీఆర్ … ఇందుకోసం దాదాపు 1200 కోట్ల రూపాయల్ని ఇన్వెస్ట్ చేసిందన్నారు.
అయితే.. దీంతో 1000 మందికి ఉద్యోగవకాశాలు రానున్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్. దేశంలోనే మొదటి ఎంఆర్‌వో సెంటర్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం చాలాసంతోషమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బెంగుళూరు, చెన్నై లలో ఏర్పాటు చేయబోయే మరో సెంటర్ ని హైదరాబాద్ లోనే ఏర్పాటు చేయాలని సాఫ్రాన్ సీఈవో ని కోరుతున్నానన్నారు. అందుకు కావాల్సిన సదుపాయాల్ని కల్పిస్తామని, ఈ ఫెసిలిటీ సెంటర్ ని భారత్ తో పాటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉపయోగించుకొనున్నాయని ఆయన తెలిపారు. సాఫ్రాన్ డిజిటల్ ట్రన్స్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేసి 800 మందికి శిక్షణ ఇవ్వనుందని, ఏవియేషన్ అండ్ డిఫెన్స్ లలో పెట్టుబడులకి తెలంగాణ అనుకూలంగా ఉందన్నారు. తెలంగాణలో ఎరోస్పేస్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు మంత్రి కేటీఆర్ .