Minister KTR: కాలికి గాయం.. వైరల్ అవుతున్న ఫోటో

0
93

Minister KTR Left Leg Injured: మంత్రి కేటీఆర్ కాలికి గాయమైంది. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోవడంతో, కాలు చీలమండ(యాంకిల్)కు దెబ్బ తగిలింది. దీంతో ఆయనకు చికిత్స అందించారు. కాలుకి పెద్ద బూటు లాంటి బ్యాండీజే వేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను కేటీఆర్ ట్విటర్‌లో షేర్ చేసుకున్నారు. ‘‘అనుకోకుండా కాలికి గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ మూడు వారాల పాటు కాలక్షేపం కోసం ఏవైనా చూడగలిగే ఓటీటీ షోస్ ఉండే తెలపండి’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఇదిలావుండగా.. రేపు కేటీఆర్ పుట్టినరోజు కావడంతో, ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. బట్టలు దానం చేయడంతో పాటు అన్నదానం, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే.. కేటీఆర్ మాత్రం తన జన్మదిన వేడుకలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. జన్మదిన సంబరాలకు బదులు తమకు తోచిన రీతిలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద స్థానిక ప్రజలకు సహాయం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులకు సూచించారు. వర్షాలు, వరదల వల్ల ఇబ్బంది పడుతోన్న ప్రజలకు చేదోడువాదోడుగా నిలవాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here