త్వరలో వస్తా.. కేటీఆర్ ట్వీట్ పై నెటిజన్లు ఫిదా

0
99

ట్యాంక్ బండ్ శివ అదేనండి శవాల శివ ఈయన గురించి హైదరాబాద్‌ లో చాలా మందికి తెలుసు. ఎన్నో ఏళ్లుగా ట్యాంక్‌బండ్ వద్దే ఉంటున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలను ఆయన కాపాడారు. అంతేకాదు.. ట్యాంక్‌ బండ్‌ లో చనిపోయిన వారి శవాలను సైతం తన చేతులతో బయటకు తీశారు. కంపు కొట్టే హుస్సేన్ సాగర్ జలాల్లో ఈతకొడుతూ, నిస్వార్థంగా సమజానికి సేవ చేస్తున్నారు శివ. ప్రేమించి పెళ్లి చేసుకున్న శివకు భార్య, పిల్లలు వున్నారు. ఇతని నివాసం ట్యాంక్ బండ్ మీద చిన్న గుడిసె. శివ పేదరికంపై పలు పత్రికలు, ఛానెళ్లు ఇంటర్వ్యూ కూడా చేశాయి.

ఆ ఇంటర్వ్యూలలో శివ తన కష్టాలు, జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి తెలుపడంతో.. చలించిపోయిన తెలంగాణ మంత్రి కేటీఆర్ శివకు నెక్లెస్ రోడ్డులో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ఇప్పించారు. తాజాగా శివ కుటుంబం కొత్త ఇంటికి వెళ్లింది. ఇప్పుడు ప్రస్తుతం శివ తన ఫ్యామిలీతో కొత్త ఇంట్లో ఆనందంగా ఉన్నారు. అయితే.. ప్రస్తుతం ట్యాంక్ బండ్ శివ జీవితం ఎలా ఉంది? ఏం చేస్తున్నారని? ఓ యూట్యూబ్ ఛానెల్‌ ఆయన ఇంటికి వెళ్లింది. ఈనేపథ్యంలో.. శివ తన మనసులోని కోరికను బయటపెట్టారు. మంత్రి కేటీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు.. కేటీఆర్ ఎంతో మంచిమనసున్న మారాజని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు వారి కుటుంబం ఎల్లప్పుడు రుణపడి ఉంటుందని, ఆయన చేతుల మీదుగా గృహప్రవేశం జరగాలని కోరుకున్నామన్నాడు. కానీ, అది జరగనందుకు కొంత బాధగా ఉన్నా.. అన్నం పెట్టిన దాత, ఒక్కసారైన తన ఇంటి గడప తొక్కాలని అభిప్రాయపడ్డారు శివ. దీంతో ఈ వీడియోను కేటీఆర్‌ ట్వీటర్‌ కు ట్యాక్‌ చేశారు. శివ వీడియోపై స్పందించిన మంత్రి కేటీఆర్.. త్వరలోనే ట్యాంక్ బండ్ శివ ఇంటికి వెళ్తానని తెలిపారు. దీంతో సోషల్‌ మీడియాలో ఈవార్త హల్ చల్‌ గా మారింది. శివ ఇంటికి మంత్రి కేటీఆర్‌ వెళ్తారా? అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ను స్పందిస్తూ.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నెటిజన్లు పోస్ట్‌ చేస్తున్నారు. కేటీఆర్‌ అంటే మంత్రేకాదు ప్రజల్లో ఒక మనిషిని అని నిరూపించుకున్నారని నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here