జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి ముంపు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. ఈ క్రమంలో దట్టమైన అటవీ, మావోయిస్టు ప్రాబల్యం గల మహాముత్తరాం మండలంలోని పెగడపల్లి,కనుకునురు,పలిమెల గ్రామాల్లో వరద బాధితులను కలుసుకొని పునరావాస కేంద్రాల్లోనీ బాధితులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గడిచిన 10 రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాల వల్ల పలు గ్రామాలు అతలకుతలమయ్యాయని ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు జిల్లాల్లో భారీగా వరద ముంపుకు గురైన గ్రామాలు ఉన్నాయన్నారు.
ఈ క్రమంలోనే ఈరోజు భూపాలపల్లి జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన పలిమెల మండలంలోని పెగడపల్లి కునుకునూరు పలిమెల గ్రామాలను సందర్శించడం జరిగిందన్నారు. పలు గ్రామాలకు రోడ్డు సౌకర్యం వరదల వల్ల కట్ అయిందని ఇదే క్రమంలో సుమారు 2000 మంది బాధితులను పునరావాస కేంద్రాల్లో ఉంచామని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించామని జిల్లా యంత్రాంగం ప్రాణనష్టం జరగకుండా ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది మరియు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది జిల్లా అధికార యంత్రాంగం మొత్తం అన్ని చర్యలు తీసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించారని, త్వరలోనే వరద నష్టం పై జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వరద బాధితులకు సహాయం అందిస్తామన్నారు.
ఇల్లు కోల్పోయిన వారికి మూడు లక్షల రూపాయలు ఇస్తూ గృహ నిర్మాణానికి సహాయం చేస్తామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో వరద ముంపు ప్రాంతాలకు కరెంటు సౌకర్యం కల్పిస్తామని వరదల వల్ల మునిగిన పంటలకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ప్రజలేరు అధైర్యపడవద్దని వరద ముంపు ప్రాంతాలకు ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని వసతులు కల్పిస్తామని ఈ క్రమంలోనే పలిమేల గ్రామంలో వరద బాధితులకు 600 మందికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు మంత్రి సత్యవతి రాథోడ్ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తో పాటు జిల్లా అధికారులందరూ పాల్గొన్నారు.