శీనన్న స్టెప్పులు.. లష్కర్ అదిరే

0
117

తెలంగాణ‌లో లష్కర్ బోనాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. నేడు రంగం కార్య‌క్రమంలో భ‌విష్య‌వాణి నిర్వ‌హించారు. తెలంగాణ బోనాలు అనగానే తలసాని డ్యాన్స్ ఎలిమెంట్ ఠక్కున గుర్తుకొస్తుంది. లష్కర్ బోనాల నేపథ్యంలో.. తెలంగాణ మంత్రి తలసాని మరోసారి తన కళాత్మకతను చాటుకున్నారు. త‌ల‌సాని వెయ్‌ వెయ్‌ చిందెయ్ అంటూ తీన్‌మార్ దరువులకు స్టెప్పులు వేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాల్లో మిగతా భక్తులతో కలిసి మినిస్టర్ తలసాని చిందేశారు. అయితే గతంలో కూడా బోనాలు ఉత్సవాల్లో అనేకసార్లు జోష్ చూపించారు తలసాని శ్రీనివాస్ యాదవ్‌. తనయుడితో కలిసి కూడా డ్యాన్స్ చేసారు. లేటెస్ట్‌గా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాల్లో తలసాని డ్యాన్సింగ్ టాలెంట్ చూపించారు. త‌ల‌సాని తీన్‌మార్ కు వేసిన స్టెప్పులు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా.. అక్కడున్న వారంతా మంత్రి డ్యాన్స్ చూసి ఫిదా అయిపోయారు. లష్కర్ బోనాల పండుగ కార్య‌క్ర‌మంలో భారీ ఎత్తున భ‌క్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి బోనాల‌తో మ‌హిళ‌ల నృత్యాలు.. పోతురాజులు.. కొలాటం ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను అల‌రించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here