ఈటల ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నానన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గత కొన్ని రోజులు తెలంగాణ బీజేపీ ఈటల రాజేందర్ సీఎం అభ్యర్థి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా ఈటల రాజేందర్ స్పందిస్తూ.. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. బీజేపీలో ఉన్న నాయకులు కార్యకర్తలు పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి ఉంటారు. ఇందులో పదవులు వ్యక్తులుగా నిర్ణయించుకోలేరు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తారు. నేతల సామర్థ్యాన్ని గుర్తించి పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఈటల రాజేందర్ అంటూ పలు పత్రికలు,చానళ్లు,సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను.
భారతీయ జనతా పార్టీలో వ్యక్తులుగా ముఖ్యమంత్రి ఎవరు అనేది నిర్ణయించుకోలేమని మరోసారి స్పష్టం చేస్తున్నాను. నేను 20 సంవత్సరాలుగా ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ నియంతృత్వ పాలన అంతమే నా లక్ష్యం. కాషాయ జెండాను ఈ గడ్డ మీద ఎగురవేయడం కోసం పార్టీ ఏ బాధ్యత ఇస్తే దానిని శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తాను అని స్పష్టం చేశారు.