నేను మాట తప్పా.. బాధపడుతున్నా : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

0
784

మరోసారి తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు రచ్చకెక్కాయి. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌ రెడ్డి బాధత్యలు చేపట్టిన నాటి నుంచి, టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అసంతృప్తితోనే ఉన్నారు. పార్టీ పెద్దల బుజ్జగింపుతో కొన్ని రోజుల నుంచి సైలంట్‌గా ఉన్నా.. ఇప్పుడు మరోసారి రేవంత్‌ రెడ్డిపై విమర్శల గుప్పిస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ..రేపు సంచలన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.

రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట తప్పిన అనే అవేదన లో ఉన్నానన్న జగ్గారెడ్డి.. పార్టీ అంతర్గత అంశాలు మీడియాలో మాట్లాడను అని మాటిచ్చానన్నారు. కానీ రేవంత్ వ్యవహారం వల్లనే మాట తప్పానని, పార్టీ చీఫ్‌కి రాజకీయ వ్యూహం ఉండాలని, తెలంగాణలో పార్టీకి నష్టం జరిగితే నాపై నిందలు మోపే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుని తెలంగాణ కనుమరుగు చేసింది ఓటుకు నోటు కేసు, రేవంత్ రెడ్డి అతి ఉత్సాహం దీనికి కారణమన్నారు. పార్టీ నడిపే నాయకుడికి వ్యూహం ఉండాలన్నా జగ్గారెడ్డి.. కానీ రేవంత్ కి అది లేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here