కేసిఆర్ తోనే నా కొట్లాట : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

0
77

హైద్రాబాద్ లోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో నాకు ఘోర అవమానం జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసినోళ్ళను పక్కనపెట్టి, ద్రోహులకు పదవులివ్వడం ఆవేదనకు గురి చేసిందన్నారు. టీఆర్ఎస్ హవాలోనూ మునుగోడులో ఘన విజయం సాదించానని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా.. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా….. ఎమ్మెల్యేగా గెలిపొందానని ఆయన వ్యాఖ్యానించారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడినా హై కమాండ్ లో చలనం లేదని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. నేను సీఎల్పీ పదవిలో ఉంటే ఎమ్మెల్యేలను కాపాడుకునే వాన్ని అని ఆయన అన్నారు.

 

రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు, ఇక భవిష్యత్ అంతా బీజేపీదే అని ఆయన జోస్యం చెప్పారు. రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదని, గెలిచినోళ్లు ఆ పార్టీలో ఉంటారని గ్యారంటీ లేదని ఆయన అన్నారు. రేపటి నుంచి రాజీనామా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండని, ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ తోనే నిర్ణయం తీసుకుందామని ఆయన తన అనుచరులకు సూచించారు. మూడున్నరేళ్లుగా మునుగోడు అభివృద్ధి చేయలేక పోయామని, ఉప ఎన్నిక వస్తేనైనా ప్రజలకు మేలు జరుగుతుందంటే రాజీనామా చేస్తానన్నారు. కేసిఆర్ తోనే నా కొట్లాట అని ఆయన స్పష్టం చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here