ఢిల్లీ మద్యం విధానంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను ఢిల్లీ బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్ట దావా వేయనున్నారు. బీజేపీఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా పై పరువు నష్టం దావాకు వేసేందుకు కవిత సిద్దమయ్యారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కవిత కోర్టును అశ్రయించనున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో కవిత చర్చలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో.. లిక్కర్ స్కాం దర్యాప్తులో సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. లిక్కర్ వ్యాపారి రామచంద్ర పిళ్ళై ఇంట్లో సీబీఊ సోదాలు నిర్వహించింది. లిక్కర్ స్కాంలో ఏ15గా రామచంద్ర పిళ్ళై, రాబిన్ డిస్టిలరీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రెండున్నరకోట్లు ఢిల్లీ పెద్దలకు ఇచ్చినట్టు ఆధారాలు వున్నాయని సీబీఐ తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్కామ్ లింకులు బయటపడుతున్నాయి. తాజాగా కేంద్ర బీజేపీ నాయకులు ఈ స్కామ్ లో సీఎం కేసీఆర్ కుమార్తె కవితదే ముఖ్యపాత్ర అని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంకి నాకు ఎటువంటి సంబంధం లేదని, దర్యాప్తుకు సహకరిస్తా అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. లిక్కర్ స్కాం ఆరోపణలపై కవిత స్పందిస్తూ.. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నేను మానసికింగా కుంగిపోతానని వారు అనుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈపోరాటంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. నాపై ఆరోపణలు చేసిన కేంద్రంపై పోరాటంలో వెనక్కొ తగ్గేదిలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు.. బట్టకాల్చి మీద వేస్తున్నారు. ఎవరి మీద వారిమీద ఆరోపణలు చేయడం సరైంది కాదు.. కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ భయపడతారని ఇలాంటి ఆలోచన చేస్తున్నారు. ఇది వ్యర్థ ప్రయత్నాలు మిగిలిపోతాయి.. కేసీఆర్ ని మానసికంగా కృంగదీయాలని చూస్తున్నారు.. మాపై ఆరోపణలు చేసినా మడమ తిప్పకుండా పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు.
<a href=”https://ntvtelugu.com/andhra-pradesh-news/ap-cm-meets-prime-minister-narendramodi-217980.html”>AP Cm Jaganmohan Reddy: ప్రధాని మోడీతో సీఎం వైఎస్.జగన్ భేటీ</a>