నగరంలో మళ్లీ వాన.. పలు ప్రాంతాల్లో చిరు జల్లులు

0
103

Rain in Several Places in Hyderabad: నగరంలో చిరుజల్లులు మళ్ళీ షురూ అయ్యాయి. వరుణుడు మళ్లీ భాగ్యనగరంలో వర్షించేందుకు సిద్దమయ్యాడు. ఇవాళ దుయం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో.. నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, మాసబ్‌ట్యాంక్‌, లక్డీకపూల్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్టలో వాన కురుస్తోంది.

ఈనేపథ్యంలో.. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయవ్య దిశగా కదిలి రాగల 36 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో.. ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, వరంగల్‌, హనుమకొండ, కరీంనగర్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా.. ఈ నెల 17వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here