ఎమ్మార్వో అవినీతి.. బతికున్న మహిళకు ధరణీలో పేరుమార్పు..

0
115

భూముల వివరాలు సమగ్రంగా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తీసుకువచ్చింది. అయితే అందులో ఉన్న లోసుగులను ఆసరాగా తీసుకుని కొందరూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అందుకు నిదర్శనమే సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన. బతికున్న మహిళను చనిపోయినట్టుగా చిత్రీకరించి… వేరే వాళ్ల పేరు మీద పట్టాచేశారు అధికారులు.. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం నాగన్‌పల్లిలో హనుమంత్ రెడ్డి అనే వ్యక్తికి 198 సర్వే నెంబర్‌లో 27 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి హనుమంత్‌రెడ్డికి వారసత్వంగా వచ్చింది. అయితే హనుమంత్‌రెడ్డి గతేడాది కరోనాతో ఏప్రిల్ నెలలో చనిపోయాడు. దింతో హనుమంత్‌రెడ్డి పేరుమీదున్న భూమిని భార్య శివమ్మ ఈ ఏడాది ఏప్రిల్‌లో తన పేరుపై పట్టా చేయించుకుంది. ఈమెకి ముగ్గురుకొడుకులు, ఇద్దరు ఆడపిల్లలు.ఈమె హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివసిస్తుంది. అయితే ఈమె పేరుపై ఉన్న భూమిని ఇప్పుడు సడెన్‌గా వేరే వాళ పేరుపై మారిపోయింది.పైగా భూమి వివరాలు ధరణిలో చూపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు బాధితులు.

దీంతో ఏం జరిగిందో తేలుసుకోవడానికి సంగారెడ్డి కలెక్టరేట్‌కి వచ్చింది శివమ్మ. కలెక్టరేట్‌లో అడిషనల్‌ కలెక్టర్‌ని కలిసి విషయం చెప్పగా…. అడిషనల్ కలెక్టర్ షాకింగ్ న్యూస్ చెప్పారు. శివమ్మ చనిపోయినట్టుగా రెవెన్యూ రికార్డులో ఉందని… ఆమె పేరు మీద ఉన్న భూమిని వేరే వాళ్లపేరుపైకి మారిపోయిందని చెప్పడంతో కంగుతిన్నారు బాధితులు. తాను చనిపోలేదని…తనకు తెలియకుండా తన భూమి ఇతరుల చేతుల్లోకి ఎలా వెళ్లిందని అధికారులను ప్రశ్నించారు శివమ్మ. దింతో ధరణి రికార్డులు చూపించారు అధికారులు. పై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయండి అని చెప్పడంతో రాయికోడ్ పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు బాధితులు

రాయికోడ్ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన శివమ్మ అతని కొడుకులకు, పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వడానికి నిన్న సాయంత్రం 7గంటలకు పోతే దాదాపు 10 గంటల వరుకు అకారణంగా తమని నిలబెట్టారని ఎస్‌ఐ తో వాగ్వాదానికి దిగారు. అలాగే ఇచ్చిన కంప్లైంట్‌కి కూడా ఫిర్యాదు కాపీ ఇవ్వలేదని బాధితులకు, ఎస్‌ఐ మధ్య వాదనలు జరిగాయి. చివరికి ఫిర్యాదు కాపీ ఇచ్చి ఇంటికి పంపించారు ఎస్‌ఐ.

అయితే తన పేరు మీదున్న భూమిని వేరే వాళ్లకు పట్టా చేసింది రాయికోడ్ ఎమ్మార్వో రాజయ్యేనని ఆరోపిస్తున్నారు బాధితులు. డబ్బుకు ఆశపడి ఈ పనిచేశాడని చెబుతున్నారు. ధరణిలో ఉన్న లోపాలను ఆసరగా చేసుకుని ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించారు. తన పేరు మీద నకిలీ పత్రాలు సృష్టించి భూమిని వేరే వాళ్లకు పట్టాచేశారని బాధితుల ఆవేదన. తను చనిపోకముందే చనిపోయానని ఎమ్మార్వో ఎలా ధృవికరిస్తారని ప్రశ్నిస్తున్నారు. అలాగే నకిలీ ఆధారు, నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌, నకిలీ భూమి పత్రాలు క్రియేట్ చేసి ఈ అక్రమాలకు పాల్పడ్డారని చెబుతున్నారు. ఇందులో ఎమ్మార్వోతో పాటు ఇంకెవరీ పాత్ర ఉందో విచారణ చేయాలని చెబుతున్నారు.

మొత్తంగా బతికిఉన్న మహిళను చనిపోయినట్టుగా చిత్రీకరించి ఉన్న భూమిని వేరే వాళ్ల పేరుపై పట్టా చేయడంతో మరోసారి ధరణి పోర్టల్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కులకు ధరణి ఓ వరంలా మారిందని చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
<a href=”https://ntvtelugu.com/business-news/ap-telangana-to-get-export-promotion-council-branch-offices-235736.html”>AP, Telangana: ఏపీ, తెలంగాణల్లో ‘ఎక్స్‌పోర్ట్‌’ ఆఫీసులు</a>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here