ప్రమాదం జరిగినా.. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి చేరిస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చు. కానీ మానవత్వం ఛాయలు కనీసం ఇసుమంతైనా కనిపించడంలేదు. ఈ చిత్రంలో కనిపిస్తున్న యువకుడు పేరు అనుపురం దీపక్.అందరూ ముద్దుగా బన్నీ అని పిలుచుకునే ఒక సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు .తండ్రి కులవృత్తి అయిన కల్లు గీసే పనిలో ఉంటూ తాటిచెట్టుపై నుండి పడి కొంత కాలం కిందటే గాయాలపాలయ్యారు.దీంతో కుటుంబ బాధ్యతలను పాలుపంచుకున్నాడు దీపక్… ఈమధ్య ఓ ప్రైవేటు సంస్థలో కరీంనగర్ పట్టణంలో ఉద్యోగంలో చేరిన దీపక్ తన సొంత ఊరిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి డ్యూటీలో చేరడానికి తెల్లవారుజామున కరీంనగర్ కి సోమవారం ఉదయం వెళ్తున్నాడు.
కరీంనగర్ – జగిత్యాల హైవేపై వెళుతున్న క్రమంలో రాంగ్ రూట్ లో వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది .తీవ్రగాయాలైన దీపక్ అక్కడే పడిపోయాడు. కనీసం లేవలేని పరిస్థితిలో అచేతనంగా ఉండిపోయాడు. అయితే సదరు ఢీకొట్టిన వ్యక్తి తన వాహనాన్ని ఏ మాత్రం ఆపకుండా అక్కడి నుండి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో చాలా సమయం పాటు స్పృహలోకి రాలేని దీపక్ తన ప్రాణాలు విడిచాడు. ఎన్నో కలలతో భవిష్యత్తు చూడాలనుకున్న ఒక్కగానొక్క కుమారుడు అర్ధాంతరంగా విగతజీవిగా పడి ఉండడం అతని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. సున్నిత మనస్కుడిగా …. అందరితో కలుపుగోలుగా ఉండే దీపక్ మరణం పట్ల బంధుమిత్రులు తీవ్రంగా రోదించారు. విషయం తెలిసిన వెంటనే అతని స్నేహితులు కరీంనగర్ ప్రధాన ఆస్పత్రి కి చేరుకొని స్నేహితుడి పార్ధివ దేహాన్ని చూసి రోదించడం పలువురిని కలిచివేసింది.
నిజానికి ఇలాంటి ప్రమాదాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రమాదానికి కారణమైన వారు మాత్రం అక్కడి నుండి తప్పించుకునే క్రమంలో ఎవరి ప్రాణాలు పోయినా పట్టించుకునేలా లేరు. చట్టానికి తాము దొరక్కుండా ఉంటే చాలు అనే భావనతో ఢీకొట్టిన వెంటనే అక్కడి నుండి పారిపోతున్నారు. కానీ బాధితుల కుటుంబాలు, ఎంతోమంది స్నేహితులకు తీవ్రమైన వేదన మిగులుస్తున్నామని ఎవరికీ తెలీడం లేదు. ఈ ఆలోచన కూడా వారిలో ఉండడం లేదు. ఎవరేమైపోతే మాకేంటి? అనే నిర్లక్ష్యమే వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదవశాత్తు ఢీకొట్టిన కనీసం గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా హిట్ అండ్ రన్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు తీసే దుర్మార్గులను శిక్షించడానికి కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. సరైన సాక్షాధారాలు లభించిన వెంటనే పోలీసులు ఆయా సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి సకాలంలో నిందితులను పట్టుకుంటే ఎంతటివారైనా సరే ఈ చట్టాల నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. చ