తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు కొంత కాలంగా ఎదురుచూస్తోన్న మునుగోడు ఉప ఎన్నికకు సమయం రానే వచ్చింది. రేపటి నుంచి మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్లు షురూ కానున్నాయి. అయితే..టీఆర్ఎస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించక పోవడం చర్చకు దారితీస్తోంది. ఇవాళ మునుగోడుకు మంత్రులు, ఎమ్మెల్యేలు.. మునుగోడు నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా టీఆర్ఎస్ విభజించింది. ఒక్కో యూనిట్ బాద్యతలను ఒక్కో బృందానికి అప్పగించింది.
అక్టోబర్ 3న మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 7వ తేదీ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఈసీ షెడ్యూల్లో వెల్లడించింది. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగనున్నట్టు పేర్కొంది. బీహార్లోని రెండు స్థానాలకు, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశాలోని ఒక్కో అసెంబ్లీ స్థానంతో పాటు తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి షెడ్యూల్ ప్రకటించి ఈసీ. ఆ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా అక్టోబర్ 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 15వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండగా, నామినేషన్ల ఉపసంహరణకు 17వ తేదీ గడువుగా పెట్టారు. ఇక, నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా నవంబర్ 6వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. నవంబర్ 8వ తేదీతో ఉప ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగుస్తుందని ఈసీ పేర్కొంది.