మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని పనస రవికుమార్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో రవి కుమార్ పనస, శ్రవణ్ దాసోజు తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రవి పనస సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా రవి పనస, డాక్టర్ శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ… తెలంగాణ, భారతదేశానికి గుండెలాంటిదన్నారు. అలాంటి తెలంగాణను తెచ్చిన టీఆర్ఎస్తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… శ్రవణ్, రవి పనస పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. వారిని హృదయ పూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
అటు ప్రతి పేదవాడికి తమ ప్రభుత్వం న్యాయం చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో కరెంటు సమస్య తీరిపోయిందని తెలిపారు. ఒకప్పుడు నల్గొండ జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని, నల్గొండ జిల్లాలో అమ్మాయిని ఇవ్వాలంటే తల్లిదండ్రులు ఆలోచించేవారని కేటీఆర్ తెలిపారు.