అన్నా మీరే మాకు ఆదర్శం … కేటీఆర్ ని కలిసిన నీలం మధు

0
427

పటాన్ చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలు మంత్రి కేటీఆర్ ని కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు చిట్కుల్ సర్పంచ్, బీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్. ఈ సందర్భంగా నీలం మధు ను మెచ్చుకున్నారు మంత్రి కేటీఆర్ . బీఅర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ మరోసారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారి నుంచి ప్రశంసలు పొందారు. మధు బాయ్ మంచిదేనా..? మీ సేవలు అభినందనీయని మెచ్చుకున్నారు. గురువారం పటాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి నీలం మధు మంత్రి కేటీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.

ఏంసీహెచ్అర్డీ లో మంత్రి కేటీఆర్ మధుతో కొద్ది సేపు ముచ్చటించారు. మధు బాయ్ అంతా మంచిదేనా..? మీ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. యువ నాయకత్వమే బీఆర్ఎస్ కు కొండత అండ అని ప్రత్యేకంగా అభినందించారు. రాబోయేది కూడా మన ప్రభుత్వమేనని, పార్టీ శ్రేణులంతా సమర్థవంతంగా పనిచేయాలని మంత్రి కేటీఆర్ గారు సూచించినట్లు నీలం మధు చెప్పారు. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి అదికారంలోకి తీసుకురావడమే లక్షంగా పనిచేస్తున్నామని నీలం మధు మంత్రి కేటీఆర్ కి వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here