నిరంతర అధ్యయనంతోనే గెలుపు

0
117

గీతం బిజినెస్ స్కూల్‌లో యాజమాన్య వికాస కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. యాజమాన్య మెలకువలను ప్రతి ఒక్కరూ నేర్చుకుంటూనే వుండాలని వక్తలు పేర్కొన్నారు. గీతం బిజినెస్ స్కూల్ హైదరాబాద్ లోని రుద్రారం క్యాంపస్‌ లో ఈ నెల 2-3 తేదీల్లో సమర్థ పనితీరు (Performance Excellence) అనే అంశంపై రెండురోజుల యాజమాన్య వికాస కార్యక్రమం (MDP) నిర్వహించారు.

ప్రముఖ ఫార్మాస్యూటికల్ దిగ్గజం హెటిరో ఫార్మసీకి చెందిన ఉన్నతస్థాయి మేనేజర్ల కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమం ముగింపు ఉత్సవం బుధవారం ముగిసింది. సిబ్బంది పనితీరు నైపుణ్యం, సంస్థ లక్ష్యాలను సాధించడంలో వారి పాత్ర వుంటి ముఖ్యమయిన అంశాలపై ఈ ఎంపీడీలో ఫోకస్ చేశారు. ఇందులో పాల్గొన్న 14 మంది యాజమాన్య సిబ్బంది కార్యక్రమ నిర్వహణ, వసతి, ఇతరత్రా ఏర్పాట్లతో పాటు ముఖ్యంగా అద్భుతమయిన శిక్షణ పొందిన నైపుణ్యాల గురించి ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో గీతం బీస్కూల్ అధ్యాపకులు డాక్టర్ దివ్య కీర్తి గుప్తా, ప్రొఫెసర్ కృష్ణమోహన్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయడంతో పాటు, అతిథుల ప్రశంసలను అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here