పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ నగర శివారులోని ఫాం హౌస్‌లను అడ్డాలుగా చేసుకుని కాయ్ రాజా కాయ్ అంటున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో పేకాటరాయుళ్ళ ఆటకట్టించారు పోలీసులు. బుధవారం సాయంత్రం ఆరుగంటలకి అజీజ్ నగర్ లో ఒక ఫార్మ్ హౌస్ లో పేకాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడులు చేశారు పోలీసులు సమాచారం అందుకున్న మొయినాబాద్ ఎస్ ఐ ప్రణయ్ తేజ్ , హెడ్ కానిస్టేబుల్ గోవింద్, కానిస్టేబుల్ నర్సింహా , అనిల్ తో కలిసి ఫార్మ్ హౌస్ పై దాడి చేశారు.
ఈదాడిలో 17 మంది పేకాడుతూ దొరికిపోయారు. ఈ ముఠాలో నలుగురు తప్పించుకున్నారు. 13 మందిని అదుపులోకి తీసుకొని వారు పేకాడుతున్న ప్రదేశం నుండి తొమ్మిది లక్షల 97 వేల రూపాయల నగదు, 15 సెల్ ఫోన్ లు, మూడుకార్లు సీజ్ చేసినారు, వీరంతా జన్వాడ గ్రామానికి చెందిన వారని మొయినాబాద్ పోలీసులు తెలిపారు.
జగద్గిరిగుట్టలో దొంగల హల్ చల్
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని జగద్దిరి గుట్ట పోలీస్ స్టేషన్ పరిధి లోని ఎల్లమ్మబండలో అర్ధరాత్రి దొంగల హల్చల్ చేశారు. ఇంటి గ్రిల్స్ తొలగించి దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు. దొంగల అలజడితో నిద్రలేచిన ఇంటి ఓనర్.. వారిని గమనించి కేకలు వేశారు. దీంతో దొంగలు పరారయ్యారు. సీసీ కెమెరాలు ఆధారంగా దొంగలను పట్టుకున్నారు ఇంటి యజమాని. దొంగలను బంధించి పోలీసులకు అప్పజెప్పారు స్థానికులు. నిందితులలో ఒకరిని ఎల్లమ్మ బండ లోని పీజేఆర్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ గా గుర్తించారు.