పోలవరం ప్రాజెక్టు వల్లనే వరద పెరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ నేత బాలసాని లక్ష్మీనారాయణ తీవ్రంగామండిపడ్డారు. దిగువున నిర్మించిన పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం నుంచి వరద దిగివకి వెళ్లడం లేదని అంటున్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద మూడవ ప్రమాద హెచ్చరిక దాటి ఈ సమయంలో ప్రవహించటం గతంలో ఎప్పుడూ లేదు అని చెప్పారు .పోలవరం వద్ద నీళ్లు ఎక్కువగా వెళ్లకపోవడం వల్ల ఎగవ నుంచి వచ్చే వరద నిలిచిపోతుందని చెప్తున్నారు . తనకి ఈ ప్రాంతంతో 30 సంవత్సరాలు అనుభవం ఉందని ఇప్పుడు వస్తున్న వరద ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాల అందరికీ సహాయకరంగా ఉంటుందని తెలిపారు.
అందరూ.. అప్రమత్తంగా వుంటున్నామని, దేనినైనా ఎదుర్కొంటామని ఎస్పీ వినీత్ వివరాఇంచారు. భద్రాచలం వద్ద గోదావరి అంతకంతకు పెరుగుతుందని ప్రజలు జాగ్రత్తగా ,అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ సూచించారు . భద్రాచలం వద్ద గోదావరి ఈ రాత్రి కి 62 అడుగులు దాటి వస్తుందని సిడబ్ల్యుసి ఇచ్చిన అంచనాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రతిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ మేరకు భద్రాచలం ప్రాంతంలో ఎస్పీ వినీత్ పలు ప్రాంతాల్ని పర్యటించారు పరిస్థితిని సమీక్షిస్తున్నారు మేము అప్రమత్తంగా ఉన్నామని ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోటానికి సిద్ధంగా ఉన్నామని అంటున్న ఎస్పీ వినీత్ పేర్కొన్నారు.