బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. తెలంగాణలో ఇరు పార్టీల మధ్య పోస్టర్ వార్

0
55

Poster War In Telangana: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ల మధ్య పోస్టర్ వార్ ముదురుతోంది. నువ్వా నేనా అన్నరీతిలో పోస్టర్లు పెడుతూ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ పనులపై ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తూ పోస్టర్ వెలిసింది. తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మోదీ నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఇప్పటికే బీఆర్ఎస్ మండిపడుతోంది. ఐదేళ్లు పూర్తి అయినా ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు 40 శాతం కూడా పూర్తి కాలేదని, ఇంకెన్నినాళ్లు ఈ ఫ్లైఓవర్ కడుతారంటూ మోదీని ప్రశ్నిస్తూ అడుగడుగున పోస్టర్లు వెలిశాయి.

Mp Arvind

Read Also: Super Sketch: కృష్ణ కోసం సిమ్రాన్‎ను చంపిన జ్యోతి.. దారం, ముక్కు పుడకే ఆధారం

ఇదిలా ఉంటే బీజేపీ కూడా అంతేధీటుగా బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వమే ఫ్లైఓవర్ నిర్మాణ జాప్యానికి కారణం అంటూ మంత్రి కేటీఆర్ పోస్టర్లు వెలిశాయి. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై పసుపు బోర్డు గురించి ప్రశ్నిస్తూ పోస్టర్లు వెలుగులోకిరాగా.. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ తలదించుకునేలా చేశారంటూ పోస్టర్లు వెలిశాయి.

Kavita

గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన బీజేపీ నేత అరవింద్ ప్రధానంగా పసుపుబోర్డు హామీ ఇచ్చారు. దీనిని ప్రశ్నిస్తూ ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపుబోర్డు అంటూ ‘‘పసుపు కలర్ బోర్డు’’తో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Ktr

ఈ పోస్టర్ వార్ తో ఇరు పార్టీల మధ్య రాజకీయ వేడి రగులుతోంది. మరోసారి బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి రావాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే బీజేపీ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది. ఇన్నాళ్లు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలని భావిస్తోంది. అయితే అధికారం లేకపోతే ప్రతిపక్షం టార్గెట్ గా బీజేపీ రాజకీయాలు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here